Advertisement

దాసరి తర్వాత స్థానం వైవిఎస్ దే!

Wed 23rd May 2018 06:16 PM
yvs chowdary,celluloid scientist,birthday  దాసరి తర్వాత స్థానం వైవిఎస్ దే!
YVS Chowdary Birthday Special Article దాసరి తర్వాత స్థానం వైవిఎస్ దే!
Advertisement

యలమంచిలి వేంకట సత్యనారాయణ చౌదరి స్క్రీన్ నేమ్ వై వి యస్ చౌదరి, మే 23 న పుట్టిన రోజు సందర్భంగా అతని కెరీర్  సింహావలోకనం చేసుకుంటే... విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు  నందమూరి తారక రామరావు వీర అభిమాని అయిన అతను ఆ మహానటుడి తేజోరూపం పట్ల  ఆకర్షితుడై తెలుగు సినీ రంగంలోకి ప్రవేశించి ఓ గొప్ప దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రైటర్ గా, నిర్మాతగా, పంపిణీదారుడిగా మరియు ప్రదర్శన దారుడిగా ఈనాడు టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని నిలపెట్టుకున్నాడు వై వి యస్ చౌదరి. తన అభిమాన నటుడు యన్టీర్ ను మాస్ హీరోగా ఎలివేట్ చేసిన కె.రాఘవేంద్ర రావు వద్ద  శిష్యరికం చేశాడు.  తన గురువు లెజెండరీ దర్శకుడు కె రాఘవేంద్ర రావు, వై వి యస్ చౌదరి పుట్టిన తేదీ మే 23 ఒకే రోజు కావటం ఒక విశేషమైతే, పాటల చిత్రీకరణలో, హీరోయిన్లను గ్లామర్ గా  చూపించడంలో ఇద్దరికి సామీప్యత ఉండడం గమనార్హం. 

ఇంకా రామ్ గోపాల్ వర్మ, హిందీ దర్శకుడు మహేష్ బట్ మరియు కృష్ణ వంశీల వంటి దర్శకులతో  పనిచేసిన  అనుభవంతో, 1998 లో  అక్కినేని నాగార్జున నిర్మాతగా,  మహా నటుడు అక్కినేని నాగేశ్వర రావు,  కొత్త నటీనటులతో 'సీతా రాముల కళ్యాణం చూతము రారండి'  చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఆ చిత్రం విజయవంతం కావడంతో ఇదే బ్యానర్ లో ఎన్నో సంవత్సరాలుగా నటనకు దూరంగా వున్న నందమూరి హరి కృష్ణకు మళ్ళీ మేకప్ వేసి అక్కినేని నాగార్జునకు అన్నగా నటింపచేశాడు. ఆ తరువాత మహేష్ బాబు హీరోగా 'యువరాజు' చిత్రానికి దర్శకత్వం వహించాడు. 'బొమ్మరిల్లు వారి' అనే  బ్యానర్ స్థాపించి 'లాహిరి లాహిరి లాహిరిలో'.. వంటి కుటుంబకథా చిత్రం, ఈ చిత్రంలో  అంకిత, ఆదిత్యలను  టాలీవుడ్ కి పరిచయం చేశాడు.  'సీతయ్య..ఎవడి మాట వినడు' వంటి మాస్ మసాలా చిత్రం, మరోసారి మరో  కొత్త హీరో హీరోయిన్ రామ్, ఇలియానాలను టాలీవుడ్ కి అందించాడు వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో  ఏ రేంజ్ కి వెళ్ళారన్నది మనం చూస్తున్నాం. 

బొమ్మరిల్లు వారి బ్యానర్ లో హ్యాట్రిక్ హిట్ కొట్టిన చౌదరి నందమూరి బాలకృష్ణ హీరోగా 'ఒక్క మగాడు'  స్వీయ దర్శకత్వంలో అందించాడు. మంచు విష్ణుతో 'సలీం' చిత్రం తరువాత మళ్ళీ బొమ్మరిల్లు వారి బ్యానర్ లో మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ను హీరోగా పరిచయం చేసి 'రేయ్' చిత్రంతో మరో మాస్ హీరోను టాలీవుడ్ కి పరిచయం చేశాడు. ప్రస్తుతం మళ్ళీ కొత్త నటీనటులతో సరికొత్త సబ్జెక్టు రెడీ చేస్తున్నారు వై వి యస్ చౌదరి. ఆనాడు తెలుగు సినిమాకు కొత్త నటులను పరిచయం చేసి టాలీవుడ్ లో గొప్ప నటీనటులుగా నిలబెట్టిన ఘనత స్వర్గీయ  దాసరి నారాయణ రావుకు చెందుతుంది.  తరువాత ఆ స్థానంలో వై వి యస్ కి చెందుతుంది అనడంలో సందేహం లేదు. 

YVS Chowdary Birthday Special Article:

YVS Chowdary Celluloid Scientist for New Heroines

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement