Advertisement

రామ్ తో అంత అంటే కష్టమే!

Wed 23rd May 2018 03:06 PM
hero ram,praveen sattaru,new movie,sravanthi ravi kishore  రామ్ తో అంత అంటే కష్టమే!
Doubts on Ram and Praveen Sattaru Film రామ్ తో అంత అంటే కష్టమే!
Advertisement

సాధారణంగా ఏ హీరోతో ఏ నిర్మాత చిత్రం చేసినా వారి మార్కెట్‌, బిజినెస్‌లను బట్టి బడ్జెట్‌ని నిర్ణయిస్తారు. కానీ ఈమధ్య కాలంలో కొందరు హీరోల చిత్రాలకు వారి బిజినెస్‌తో సంబంధం లేకుండా బడ్జెట్‌లను పెట్టడంతో ఆయా చిత్రాలు బాగా ఉన్నాయని మంచి టాక్‌ వచ్చినా ఆర్దికంగా అవి నష్టాలనే మిగిల్చాయి. ఆయా చిత్రాల పాజిటివ్‌ టాక్‌, బిజినెస్‌ పరంగా, కలెక్షన్లు, వసూళ్లకు అసలు పొంతనే లేకుండా పోయింది. అలాంటి చిత్రాలలో ఒకటి రాజశేఖర్‌ కమ్‌ బ్యాక్‌ మూవీగా చెప్పుకునే 'పీఎస్వీ గరుడవేగ, ఉన్నది ఒకటే జిందగీ, హలో' వంటి చిత్రాలు ఈ కోవలోకే వస్తాయి. ఇక మూడు నాలుగు కోట్లు బిజినెస్‌ కూడా లేని రాజశేఖర్‌ మీద ఏకంగా 20నుంచి 30 కోట్లు పెట్టిన 'పీఎస్వీగరుడవేగ'కి ఎంతో మంచి టాక్‌ వచ్చినా అందరికీ ఈ చిత్రం భారీ నష్టాలనే కలిగించింది. బహుశా దర్శకుడు ప్రవీణ్‌సత్తార్‌ లెక్కల్లో తేడా వచ్చిందనే టాక్‌ వినిపించింది. 

ఇక తాజాగా ప్రవీణ్‌సత్తార్‌ రామ్‌తో ఓ చిత్రం చేయాలని ప్లాన్‌ చేశాడు. రామ్‌కి కూడా 'నేను..శైలజ' ముందు ఆతర్వాత పెద్ద హిట్‌ అనేదే లేదు. యావరేజ్‌ బడ్జెట్‌తో తీసిన 'ఉన్నది ఒకటే జిందగీ' కూడా నష్టాలనే మిగిల్చింది. ఈ సమయంలో ప్రవీణ్‌సత్తార్‌ రామ్‌తో తీయాలనుకున్న చిత్రం బడ్జెట్‌ ఎక్కువగా విదేశాలలో చిత్రీకరణ తీయాల్సివుండంటంతో దాదాపుగా దీని బడ్జెట్‌ కూడా 'పీఎస్వీగరుడవేగ' రేంజ్‌లోనే ఉంటుందని అంచనాకు రావడంతో ఈచిత్రాన్ని నిర్మించాలని భావించిన భవ్య క్రియేషన్స్‌ వారు ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నారు. దాంతో తన పెద్దనాన్న స్రవంతి రవికిషోర్‌ నిర్మాణంలోనే దీనిని చిత్రీకరిస్తారని వార్తలు వచ్చాయి. 

కానీ ప్రస్తుతం స్రవంతి రవికిషోర్‌తో పాటు రామ్‌ కూడా ఈ చిత్రానికి ఇంత బడ్జెట్‌ అయితే వర్కౌట్‌ కాదని భావిస్తున్నారట. ఎంతైనా మన వాడే హీరో అయినా కోట్లతో ముడిపడిన అంశం కావడంతో ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ చేయడం మంచిది కాదనే నిర్ణయాన్ని ఎంతో కాలిక్యులేటెడ్‌గా ఉండే స్రవంతి రవికిషోర్‌ కూడా తీసుకున్నాడని తెలుస్తోంది. మరి ఈచిత్రం చేయడానికి ఎవరు ముందుకు వస్తారో వేచిచూడాల్సివుంది...! 

Doubts on Ram and Praveen Sattaru Film:

Sravanthi Ravi Kishore Stopped Ram and Praveen Sattaru Film

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement