Advertisementt

అను తప్పుకుంది ఆ ప్రాబ్లమ్ వల్లేనా?

Tue 22nd May 2018 04:04 PM
anu emmanuel,ravi teja,faces,problems  అను తప్పుకుంది ఆ ప్రాబ్లమ్ వల్లేనా?
Anu Emmanuel Out From Ravi Teja Film అను తప్పుకుంది ఆ ప్రాబ్లమ్ వల్లేనా?
Advertisement
Ads by CJ

ప్రస్తుత కాలంలో హీరోయిన్స్ కి అవకాశాలు రావాలే గాని.. ఎడా పెడా రెండు మూడు సినిమాలు చేసుకుపోతున్నారు. గతంలో సమంత, కాజల్, అనుష్క లాంటి వాళ్ళు అలానే స్టార్ హీరోయిన్స్ అయ్యారు. ప్రస్తుతం కూడా అలాంటి హీరోయిన్స్ ఉన్నారు. అలాంటి వారిలో ఉన్న హీరోయిన్ ఎవరో కాదు డీజే దువ్వాడ జగన్నాధంలో బికినీతో దున్నేసిన పూజా హెగ్డే. డీజే సినిమాతో వరుస ఆఫర్స్ ని వడిసి పట్టుకున్న పూజా హెగ్డే ప్రస్తుతం ముగ్గురు స్టార్ హీరోలతో సెట్స్ మీదకెళ్లబోతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ తో అరవింద సమేత సినిమా చేస్తున్న పూజా హెగ్డే మహేష్ తో వంశి పైడిపల్లి తెరకెక్కించబోతోన్న సినిమాతో సెట్స్ మీదకెళ్లడానికి రెడీ అయ్యింది. అలాగే ప్రభాస్ - రాధాకృష్ణ సినిమాలోనూ హీరోయిన్ గా చేయబోతోంది. మరి ఎన్టీఆర్ తో మాస్ స్టెప్స్ వేస్తూ చాలా కష్టపడాలి. కానీ మహేష్ సినిమాలో పెద్దగా డాన్స్ లు చెయ్యాల్సిన అవసరం ఉండదు. అలాగే ప్రభాస్ తో సినిమా కూడా. మరి ఒకేసారి మూడు సినిమాలు చేస్తున్న పూజా హెగ్డేకి రాని డేట్స్ క్లాష్ ఒకే ఒక సినిమా చేతిలో ఉండగా.. మరో సినిమాకి ఎందుకు వస్తుంది.

ఆ విషయం ఏదో అను ఇమ్మాన్యుయేల్ కే తెలియాలి. అజ్ఞాతవాసి, నా పేరు సూర్య సినిమాలు రెండు పోవడంతో.. ఢీలా పడ్డ అను ఇమ్మాన్యుయేల్ కి నాగ చైతన్య -  మారుతిల శైలజారెడ్డి సినిమా ఆఫర్ వుంది. అలాగే రవితేజ - శ్రీనువైట్ల సినిమాలో కూడా హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. అయితే తాజాగా అను ఇమ్మాన్యుయేల్ తాను రవితేజ సినిమా నుండి తప్పుకుంటున్నట్టుగా చెప్పడమే కాదు.. కారణం కూడా చెప్పేసింది. తనకి శైలజ రెడ్డి సినిమా డేట్స్ రవితేజ - శ్రీనుల సినిమా డేట్స్ సెట్ కాకపోవడంతోనే రవితేజ సినిమా నుండి తప్పుకున్నా అని చెప్పింది. మరి కేవలం రెండు సినిమాల్లో డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోవడం జోక్. మరి అనునే తప్పుకుందా? లేకపోతే ప్లాప్ హీరోయిన్ మనకెందుకులే అని రవితేజ అండ్ కో తప్పించారో? అనేది ప్రస్తుతానికున్న పెద్ద డౌట్.

అయితే అను ఇమ్మాన్యుయేల్ తన ఫ్యామిలీ విషయంలో ఎదో సఫర్ అవుతుందని.. అందుకే ఇలా సినిమాలు వదిలేసుకుంటుందని అంటున్నారు. గతంలో నా పేరు సూర్య సక్సెస్ మీట్ కి కూడా తాను రాలేకపోతున్నానని.. క్షమించమని... తనకున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తోనే తాను ఈ ఈవెంట్ కి రాలేదని చెప్పింది. మరి అనుకి ఉన్న ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమిటనేది తెలియాల్సి ఉంది. ఏదైనా అను రవితేజ సినిమా విషయంలో అబద్ధమాడుతుందనే టాక్ మాత్రం సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యింది.

Anu Emmanuel Out From Ravi Teja Film:

Anu Emmanuel Faces Family Problems

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ