Advertisement

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా టైటిల్ ఇదేనా?

Sun 20th May 2018 02:34 PM
aravinda sametha siddhartha,ntr,trivikram,title  ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా టైటిల్ ఇదేనా?
One More Title To NTR and Trivikram Film ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా టైటిల్ ఇదేనా?
Advertisement

ప్రస్తుతం ఎన్టీఆర్ - త్రివిక్రమ్ ఫస్ట్ లుక్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎన్టీఆర్ ఫాన్స్ కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు.  రేపు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజే ఎన్టీఆర్ - త్రివిక్రమ్ ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తున్నారు చిత్ర బృందం. ఈ రోజు సాయంత్రం 4.30 కి ఎన్టీఆర్ న్యూ లుక్ బయటికొస్తుంది. అయితే త్రివిక్రమ్ - ఎన్టీఆర్ సినిమాపై ట్రేడ్ లోను ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. త్రివిక్రమ్ గత సినిమా పెద్ద డిజాస్టర్ అయినా... అయన దర్శకత్వానికి భారీ క్రేజ్ ఉంది. అయితే ఎన్టీఆర్ తో రాయలసీమ నేపథ్యంలో కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా టైటిల్ ని కూడా ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు విడుదల చేసే అవకాశాలున్నాయనే టాక్ నడుస్తుంది.

ఇప్పటికే ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా టైటిల్ గా 'అసామాన్యుడు' వాడుకలో ఉండగా.. నిన్నటికి నిన్న 'రా రా కుమారా' అనే టైటిల్ వాడుకలోకి వచ్చింది. ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ - త్రివిక్రమ్ టైటిల్ ని... ఈ సినిమా లో ఎన్టీఆర్ పేరు కు లింక్ తగిలిస్తూ 'అరవింద సమేత సిద్దార్ద్' అయినా... లేదంటే 'అరవింద సమేత రాఘవ' అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. అయితే ఈ రెండు టైటిల్స్ లో ఏదో ఒక టైటిల్ ని చిత్ర బృందం ఫైనల్ చేస్తుందని అంటున్నారు. మరి ఈ సినిమాలో ఎన్టీఆర్ ఫ్యామిలీ బాయ్ అండ్ లవర్ బాయ్ లా కనబడతాడని... అలాగే ఎన్టీఆర్ పాత్ర పేరుతోనే ఈ సినిమా టైటిల్ ఉంటుందంటూ వార్తలొస్తున్నాయి.

పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రంభ నటిస్తుందని టాక్ ఉంది. మరి ఫైనల్ గా సీనియర్ హీరోయిన్ గా ఎవరిని త్రివిక్రమ్ సెలెక్ట్ చేస్తాడో గాని.. ఆ పాత్రకి మీనా, లయ, రంభ పేర్లు వినబడుతున్నాయి. ఇకపోతే హారిక అండ్ హాసిని బ్యాన్ మీద రాధాకృష్ణ ఈ సినిమాని నిర్మిస్తుండగా... ఈ సినిమాని దసరాకి విడుదల చెయ్యాలనే టార్గెట్ గా పెట్టుకున్నారు.

One More Title To NTR and Trivikram Film:

NTR And Trivikram Film Title is Aravinda Sametha Siddhartha

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement