బిగ్‌బాస్‌-2 లో ఉండేది వీళ్ళే..!

Fri 18th May 2018 01:24 AM
  బిగ్‌బాస్‌-2 లో ఉండేది వీళ్ళే..!
Bigg Boss 2 Show Contestants Details బిగ్‌బాస్‌-2 లో ఉండేది వీళ్ళే..!
Advertisement
Ads by CJ

విదేశాల నుంచి బాలీవుడ్‌కి దిగుమతి అయి కిందటి ఏడాది తమిళంలో కమల్‌హాసన్‌, తెలుగులో యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌లు హోస్ట్‌గా వచ్చిన 'బిగ్‌బాస్‌' సీజన్‌1 బాగా హిట్టయింది. ఇక రెండో సీజన్‌కి కూడా తమిళంలో కమలే హోస్ట్‌ చేస్తుండగా, తెలుగులో మాత్రం ఎన్టీఆర్‌కి కాల్షీట్స్‌ వీలు కాలేదు. ఇక బిగ్‌బాస్‌ సీజన్‌1ని ఎన్టీఆర్‌ అద్భుతంగా నడిపాడు. ఇక సీజన్‌1 కోసం పూణెలో సెట్‌ వేసి దానిని చిత్రీకరించగా, ఈసారి సీజన్‌2ని మాత్రం అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే సెట్‌వేసి చిత్రీకరించనున్నారు. 

ఒక వీకెండ్‌లో ఎన్టీఆర్‌ కనిపించేది రెండు రోజులే అయినా ఈషో స్టార్‌మా కి విపరీతమైన టీఆర్పీలను సాధించి పెట్టింది. ఇక సీజన్‌2ని నేచురల్‌ స్టార్‌ నాని హోస్ట్‌ చేస్తున్నాడు. మొదటి సీజన్‌లో శివబాలాజీ విన్నర్‌గా నిలిచాడు. ఇక సీజన్‌2 కోసం నిన్నటితరం యంగ్‌ లవ్లీబాయ్‌ తరుణ్‌, 'మగాళ్లు ఒట్టి మాయగాళ్లే' అనే హస్కీ వాయిస్‌తో అలరించిన గీతామాధురి, ఐస్‌క్రీం ఫేమ్‌ తేజస్వి మదివాడ, ఎన్టీఆర్‌ నిన్నటితరం హీరోయిన్‌ గజాలా, యాంకర్‌ శ్యామలలతో పాటు సీనియర్‌ నటి రాశి కూడా ఈ షో సెకండ్‌ సీజన్‌లో పాల్గొననున్నట్లు సమాచారం. 

ఇక మరికొందరు పార్టిసిఫెంట్స్‌ పేర్లు త్వరలో బయటకి రానున్నాయి. రీసెంట్‌గా ఈ షో లోగోను విడుదల చేసిన కార్యక్రమ నిర్వాహకులు త్వరలో ప్రొమోను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ రెండవ సీజన్‌ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సివుంది..! 

Bigg Boss 2 Show Contestants Details:

Bigg Boss 2 Contestants List Revealed?

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ