బాలయ్య భావోద్వేగ ప్రసంగం..!

Sun 06th May 2018 03:01 PM
nandamuri balakrishna,emotional speech,dasari narayana rao,statue inauguration  బాలయ్య భావోద్వేగ ప్రసంగం..!
Balakrishna Speech At Dasari Narayana Statue Inauguration బాలయ్య భావోద్వేగ ప్రసంగం..!
Sponsored links

దాసరి నారాయణరావు అంటే ఎన్టీఆర్‌ రాజకీయ ప్రవేశం సమయంలో ఆయనకు 'బొబ్బిలిపులి, సర్దార్‌పాపారాయుడు' వంటి చిత్రాల ద్వారా ఆయన మైలేజ్‌ని పోలిటికల్‌గా ఆయన ఆశయాలు, ఆదర్శాలను గురించి ప్రజలకు తెలియజేస్తూ ఆయా చిత్రాలతో ఎన్టీఆర్‌ని ఉన్నతస్థాయిలో చూపించాడు. ఇక ఈయన ఎన్టీఆర్‌ తనయుడు బాలకృష్ణతో కూడా సినిమా చేశారు. ముఖ్యంగా దాసరి తన 150వ చిత్రంగా 'పరమవీరచక్ర' చిత్రం చేశాడు. కానీ దురదృష్టవశాత్తు ఈ చిత్రం డిజాస్టర్‌ అయింది. అయినా కూడా దాసరి కెరీర్‌లో మైలుు రాయిగా మిగిలిన 150వ చిత్రం బాలయ్యతో అంటే అది ఎంతో ప్రత్యేకమేనని చెప్పాలి. 

ఇక తాజాగా దాసరి జయంతి వేడుకలను అంటే మే 4వ తేదీని డైరెక్టర్స్‌డేగా ప్రకటించారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ చాంబర్‌లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. కాకతాళీయమో, యాదృచ్చికమో గానీ దాసరిగారు తీసిన 150వ చిత్రం నేను నటించిన 'పరమవీరచక్ర' అని చెప్పవచ్చు. ఆయన దర్శకత్వంలో నటించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఆయన అన్నారు. ఇక దాసరి గారు తన 'శివరంజనీ' చిత్రం ద్వారానే నాతో చిత్రం చేయాలని భావించారు. కానీ బాబు చదువుకుంటున్నాడు ఇప్పుడు వద్దులెండి...అని నాన్నగారు అన్నారు. 

దాసరి తన ప్రస్తానంలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఆయన మన గుండెల్లోచెరగని ముద్ర వేసుకున్నారు. ఆయనది అందరితో కలిసి పోయే స్వభావం. అలాగే ఆయనకుండ బద్దలు కొట్టినట్లు ఏ విషయంపైనైనా మాట్లాడుతారు. ఎంతో క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. ఇవన్నీ కలిపిన నిండు కుండలాంటి వ్యక్తి దాసరి నారాయణరావు.. అని బాలయ్య చెప్పాడు. 

Sponsored links

Balakrishna Speech At Dasari Narayana Statue Inauguration:

Nandamuri Balakrishna Emotional Speech At Dasari Narayana Rao's Statue Inauguration

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019