అను ఇమ్మాన్యుయేల్ కు అసలు పరీక్ష..!

అజ్ఞాతవాసి సినిమాలో కేవలం గ్లామర్ షో కి తప్ప నటనకు ఏ మాత్రం ఆస్కారం లేని పాత్రలో నటించిన అను ఇమ్మాన్యుయేల్ అందాల ఆరబోతలో మాత్రం తగ్గేది లేదంటుంది. అజ్ఞాతవాసిలో... అను, పవన్ కళ్యాణ్ మీద పడడం తప్ప చేసిందేమి లేదు. ఆ సినిమా ఇంకా సెట్స్ మీదుండగానే అనుకి మెగా హీరో అల్లు అర్జున్ నా పేరు సూర్య లో అవకాశం వచ్చింది. అయితే అజ్ఞాతవాసి సినిమా ప్లాప్ తో అను క్రేజ్ కాస్త తగ్గిందనే చెప్పాలి. అయితే అవకాశాలు మాత్రం అను కి వస్తూనే వున్నాయి.
అను ఇమ్మాన్యువల్ నా పేరు సూర్య లో చేస్తున్న గ్లామర్ షోకి ఆ సినిమా గనక హిట్ పడిందా అమ్మడుకి లక్కు వస్తుంది. లేదంటే మాత్రం అను కి రివర్స్ కాలం స్టార్ట్ అయినట్లే. నా పేరు సూర్య ట్రైలర్ అండ్ టీజర్, ప్రోమోస్ లోను పిచ్చ పిచ్చగా అందాల ఆరబోతకు దిగిన అను ఇమ్మాన్యువల్ ఈ సినిమా మీద భారీ హోప్స్ పెట్టుంది. ఈ సినిమా హిట్ అయ్యిందా అంటే.. అను ఎక్కడికో వెళ్ళిపోతుంది... ఈ సినిమా టాక్ ఎమన్నా తేడా కొట్టిందా ఇక అంతే అమ్మడుకి టాలీవుడ్ లో అగ్నిపరీక్షే.
ఈరోజే ప్రేక్షకుల ముందుకు వస్తున్న నా పేరు సూర్యపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఈ సినిమా హిట్ అవ్వాలని అను మాత్రం గట్టిగానే కోరుకుంటుంది. ఈ సినిమా హిట్ అయితేనే.. లేదంటే ఎంతగా అందాలు చూపించి గ్లామర్ షో చేసిన వేస్టే. ఇప్పటికే అజ్ఞాతవాసి సినిమాకి భారీ మూల్యం చెల్లించుకుంది అను. అజ్ఞాతవాసి ప్లాప్ కి ఎన్టీఆర్ సినిమా ఛాన్స్ తో పాటుగా రామ్ చరణ్ - బోయపాటి సినిమా ఛాన్స్ కోల్పోయింది.
Real Test to Anu Emmanuel with Naa Peru Surya Naa Illu India
Anu Emmanuel Hopes on Naa Peru Surya Naa Illu India







































