కొరటాలకు మహేష్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి?

Fri 04th May 2018 03:20 PM
mahesh babu,costly gift,koratala siva  కొరటాలకు మహేష్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి?
Mahesh Babu's costly gift to Koratala Siva కొరటాలకు మహేష్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి?
Sponsored links

తన కెరీర్ డౌన్ లో ఉన్నప్పుడు మహేష్ కి కొరటాల 'శ్రీమంతుడు' తో హిట్ ఇచ్చాడు. అలానే మళ్లీ అదే పరిస్థిలో ఉన్నప్పుడు 'భరత్ అనే నేను' సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు అని చాలాసార్లు మహేష్ చెప్పాడు. 'శ్రీమంతుడు' సినిమాతో మొదలైన వీరి స్నేహం 'భరత్ అనే నేను' విజయంతో మరింత బలపడింది. కొరటాల శివ తెగ నచ్చేయడంతో ట్విట్టర్ లో కొరటాల శివకూ ఫాలోవర్ గా మారిపోయాడు మహేష్.

'శ్రీమంతుడు' కంటే గొప్ప సినిమాను ఇచ్చిన కొరటాలకు మహేష్ ఓ అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చాడంట. అయితే ఆ గిఫ్ట్ ఏంటన్నది సస్పెన్స్ గా మారింది. మాములుగా మన హీరోస్ డైరెక్టర్స్ కి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ముందుగా వారికి గుర్తొచ్చేది కార్. అయితే మహేష్ కూడా కొరటాలకు కార్ ఇచ్చాడా? లేదా భవనము కానీ ప్లాట్ కానీ ఇచ్చాడా? లేక బంగారంకు సంబంధించి ఏమైనా వస్తువు ఇచ్చాడా? అని అందరిలోను క్యూరియాసిటీగా మారింది.

అయితే ఆ గిఫ్ట్ ను మీడియాకు తెలియకుండా దాచాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటూ మహేష్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. మరి ఆ గిఫ్ట్ ఏంటన్నది కొరటాల కానీ మహేష్ కానీ నోరు విప్పితేనే కానీ మనకి తెలియదు.

Sponsored links

Mahesh Babu's costly gift to Koratala Siva:

Mahesh Babu's Suspence gift to Koratala Siva

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019