'రంగస్థలం' లుక్ మార్చేందుకు చరణ్ రెడీ!

Wed 02nd May 2018 02:33 PM
ram charan,salman khan,new physique,bollywood  'రంగస్థలం' లుక్ మార్చేందుకు చరణ్ రెడీ!
Ram Charan to train with Salman Khan’s trainer for new physique 'రంగస్థలం' లుక్ మార్చేందుకు చరణ్ రెడీ!
Sponsored links

మెగా ఫ్యామిలీతో బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌కి ఎంతో అనుబంధం ఉంది. ఆయన ఏదైనా షూటింగ్‌ నిమిత్తం లేదా సినిమా ప్రమోషన్స్‌ కోసం హైదరాబాద్‌ వస్తే ఏదో ఒక సమయం చూసుకుని రామ్‌చరణ్‌కి కలుసుకుంటాడు. 'జంజీర్‌' చిత్రం సమయంలో కూడా సల్మాన్‌ చరణ్‌ కోసం తనవంతు ప్రమోషన్‌ చేయాలని చూశాడు. ఇక 'జంజీర్‌' ఫ్లాప్‌తో బాధపడ్డ చరణ్‌ని ఓదార్చి, మరో చిత్రం కావాలంటే తానే సెట్‌ చేస్తానని చెప్పినట్లు కూడా నాడు వార్తలు వచ్చాయి. కానీ ఇక ప్రస్తుతానికి మాత్రం టాలీవుడ్‌పైనే దృష్టి పెట్టాలని తండ్రి చిరంజీవి నిర్ణయం ప్రకారం చరణ్‌ నిర్ణయించుకోవడంతో ఆయన రెండో బాలీవుడ్‌ చిత్రం విషయంలో గ్యాప్‌ తీసుకుని కేవలం టాలీవుడ్‌ మీదనే దృష్టి పెట్టాడు. 

ఇక ఈయన మాస్‌ మూస నుంచి బయటికి వచ్చి 'ధృవ' చేశాడు. ఈ చిత్రం పెద్ద నోట్ల రద్దు సమయంలో విడుదల కావడం, రీమేక్‌ కావడం వల్ల అనుకున్న రేంజ్‌లో హిట్‌కాలేదు. ఆ లోటును రామ్‌చరణ్‌ సుకుమార్‌తో కలిసి 'రంగస్థలం'తో పూర్తి చేశాడు. ఇక ఇక్కడ రామ్‌చరణ్‌ చేసే చిత్రాల గురించి సల్మాన్‌, సల్మాన్‌ బాలీవుడ్‌లో చేసే చిత్రాల పట్ల చరణ్‌లు బాగా ఆసక్తి చూపుతారు. ఇక ప్రస్తుతం 'ధృవ, రంగస్థలం' వంటి రెండు విభిన్న చిత్రాల తర్వాత మరోసారి చరణ్‌ పక్కా మాస్‌ అండ్‌ యాక్షన్‌, ఎమోషన్స్‌ ఉండే బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇందులో ఇప్పటికే తమిళ హీరో ప్రశాంత్‌, స్నేహ, వివేక్‌ ఒబేరాయ్‌, కిచ్చా సుదీప్‌ వంటి వారు ప్రధానపాత్రల్లో నటిస్తుండగా 'భరత్‌ అనే నేను'తో హిట్‌ కొట్టిన కైరా అద్వానీ చరణ్‌కి జోడీగా నటించనుంది. ఈ చిత్రం కోసం మరలా రామ్‌చరణ్‌ 'రంగస్థలం' నుంచి మేకోవర్‌ సాధించి, సరికొత్త మాస్‌గెటప్‌లో కనిపించేందుకు రంగం సిద్దమైంది. 

ఈ చిత్రంకోసం రామ్‌చరణ్‌ కండలు పెంచాల్సి ఉండటంతో పాటు ప్రత్యేక డైట్‌, జిమ్‌ వర్కౌట్స్‌ కోసం ఓ మంచిట్రైనర్‌ కోసం వెతుకుతున్న సమయంలో సల్మాన్‌ఖాన్‌ ఈ విషయం తెలుసుకుని తన పర్సనల్‌ ఫిజిక్‌ ట్రైనర్‌ అయిన రాకేష్‌ని రామ్‌చరణ్‌ వద్దకు పంపించాడు. ప్రస్తుతం ఆయన పర్యవేక్షణలో రామ్‌చరణ్‌ కసరత్తులు చేస్తున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా రామ్‌చరణ్‌ శ్రీమతి ఉపాసననే తెలిపింది. ఇక ఈచిత్రం షూటింగ్‌ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. ఈ చిత్రం ప్రారంభానికి ముందే దీని శాటిలైట్‌ రైట్స్‌తెలుగు, హిందీలో కలపి 40కోట్లకు అమ్ముడవ్వడం విశేషం. ఇక 'భరత్‌ అనే నేను' చిత్రాన్ని నిర్మించిన దానయ్యే ఈ చిత్రానికి నిర్మాత కావడం విశేషం. రెండు విభిన్నచిత్రాల తర్వాత చేయబోయే మాస్‌ చిత్రం అంటే అది కూడా వెరైటీ కిందకే రావడం ఖాయమని చెప్పవచ్చు.

Sponsored links

Ram Charan to train with Salman Khan’s trainer for new physique:

Ram Charan begins fitness training with Bollywood Superstar's trainer

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019