కొరటాల శివ పాలిటిక్స్ లోకి..!!

Mon 30th Apr 2018 03:10 PM
koratala siva,politics,mahesh babu,ktr  కొరటాల శివ పాలిటిక్స్ లోకి..!!
Koratala Siva wanted to be MLA Says Mahesh Babu కొరటాల శివ పాలిటిక్స్ లోకి..!!
Sponsored links

రీసెంట్ గా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తున్న చిత్రం 'భరత్ అనే నేను'. ఈ సినిమాలో మహేష్ సీఎం పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అలానే ఇది ఒక పొలిటికల్ మూవీ. సినిమాలో పొలిటికల్ సీన్స్.. అసెంబ్లీ సీన్స్ ను కొరటాల డీల్ చేసిన విధానం చూస్తుంటే ఆయనకు రాజకీయ వ్యవహారాలపై బాగానే అవగాహన ఉన్న విషయం అర్థమవుతుంది.

చాలా మంది డైరెక్టర్స్ సినిమాల్లో రాజకీయాల ప్రస్తావన వచ్చినపుడు జనరలైజ్డ్ ఒపీనియన్స్ ప్రకారం సన్నివేశాలు లాగించేస్తుంటారు. అప్పుడప్పుడు అవి సిల్లీగా తయారవుతుంటాయి. కానీ కొరటాల మాత్రం అలా చూపించలేదు. రియల్ లైఫ్ కి దగ్గరగా ఉన్న ప్రొబ్లెమ్స్ తీసుకుని సినిమాలో బాగానే చూపించాడు. అసలు మ్యాటర్ లోకి వెళ్తే లేటెస్ట్ తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో కలిసి మహేష్ మరియు కొరటాల ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ.. తనకు రాజకీయాల గురించి ఏమీ అవగాహన లేదని.. కానీ కొరటాల మాత్రం అలా కాదని.. ఆయనకు అపారమైన పరిజ్ఞానం ఉందని మహేష్ చెప్పాడు. ఒక సందర్భంలో కొరటాల తనతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కావాలన్న కోరిక తనకు ఉన్నట్లుగా వెల్లడించినట్లు మహేష్ చెప్పడం విశేషం. మరి కొరటాలకు ఆ కోరిక ఉందంటే.. భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ పడినా పడొచ్చేమో.  సినిమాలతో అందరి మనసులు గెలుచుకుంటున్న కొరటాల ఏదో ఒక పార్టీ తరపున పోటీ చేసి జనాల మనసులు గెలిచి.. ఎమ్మెల్యే కూడా అయినా అవుతాడేమో?

Sponsored links

Koratala Siva wanted to be MLA Says Mahesh Babu:

Koratala Siva Interest on Politics

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019