సంజూని దింపేశాడు..!

Thu 26th Apr 2018 12:43 PM
sanju,sanjay dutt,sanju teaser,rajkumar hirani  సంజూని దింపేశాడు..!
Sanju Teaser Released సంజూని దింపేశాడు..!
Sponsored links

ఈయన జీవితం ఒక సినిమా స్టోరీ కంటే విచిత్రం. ఆయన జీవితంలోఎన్నో మలుపులు,ఎన్నోచేదు సంఘటనలు. ఆయనే సంజయ్‌దత్‌. ఈయన అక్రమాయధాల కేసులో, ముంబైపేలుళ్ల ఘటనలో దోషి అని కోర్టు శిక్ష విధించడంతో జైలు జీవితం గడిపాడు. ఇక ఈయన డ్రగ్‌ ఎడిక్ట్‌గా తనయవ్వనంలో మారిపోయాడు. దాని నుంచి బయటపడేందుకు నానా విధాలుగా ట్రై చేసి, జిమ్‌వర్కౌట్స్‌ చేస్తూ డ్రగ్స్‌ని వాడటం మానివేశాడు. ఇక ఈయన చార్టెడ్‌ ఫ్లైట్స్‌లో తిరిగాడు. ఆ తర్వాత బస్సు జర్నీ చేయాల్సి వచ్చింది. న్యూయార్క్‌లోని హై బిల్డింగ్‌ విండో నుంచి ప్రపంచాన్ని చూసి విజయగర్వంతో నవ్విన అతను, అసలు కిటికీలే లేని జైలుగదిలో ఖైదీగా జీవితం గడిపాడు. ఓ హీరో జీవితంలో ఇన్ని మలుపులు ఉంటాయా? అంటే సంజయ్‌ దత్‌ జీవితంలోఉన్నాయనే చెప్పాలి. 

ఇక సంజయ్‌దత్‌ తండ్రి సునీల్‌దత్‌ నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తి. కానీ ఆయన తన కొడుకు అరెస్ట్‌ విషయంలోమాత్రం తాను కల్పించుకోనని చెప్పాడు. తనకు ఆయన్ని బయటకు తెచ్చే మార్గాలు తెలిసినా గాంధేయవాది అయిన సునీల్‌దత్‌ ఎప్పుడు ఈ విషయంలో తలదూర్చలేదు. ఇక ప్రస్తుతం రాజు హిరాణి దర్శకత్వంలో 'సంజు' పేరుతో సంజయ్‌దత్‌ బయోపిక్‌ రెడీ అవుతోంది. రాజ్‌కుమార్‌ హిరాణికి సంజయ్‌తో ఎంతో అనుబంధం ఉంది. హిరాణి దర్శకత్వంలో సంజయ్‌దత్‌ 'మున్నాభాయ్‌ ఎంబిబిఎస్‌, జీతే రహో మున్నాబాయ్‌' వంటి చిత్రాలు తీశాడు.మున్నాభాయ్‌ చలో అమెరికా అనే చిత్రాన్ని ప్లాన్‌ చేసినా వీలుకాలేదు. ఇక జూన్‌ 29న విడుదల కానున్న 'సంజు' చిత్రంలోని ఫస్ట్‌లుక్‌, టీజర్స్‌ తాజాగా విడుదలయ్యాయి. 

ఇందులో సంజూగా నటిస్తున్న రణబీర్‌కపూర్‌ తన బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్‌ డెలివరి నుంచి అన్నింటిలోనూ సంజూని అచ్చుగా దించేశాడు. సంజయ్‌ని అనుకరిస్తూ అద్భుతమై ఎక్స్‌ప్రెషన్స్‌పెట్టాడు. చిన్న టీజరే అయినా సంజు జీవితంలో ఎన్నిరకాల గెటప్స్‌లో చూపించనున్నాడో చూచాయగా చూపించిన సంజు చిత్రం ద్వారా మరలాకొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టనున్నాడని తెలుస్తోంది. ఇక ఇందులో సంజయ్‌దత్‌గా రణబీర్‌సింగ్‌ పరకాయ ప్రవేశం చేయగా, ఆయన తల్లిదండ్రుల పాత్రలైన సునీల్‌దత్‌-నర్గీస్‌ల పాత్రలను పరేష్‌రావల్‌, మనీషా కోయిరాల కనిపించనున్నారు. ఇతర పాత్రలను సోనమ్‌ కపూర్‌, అనుష్కశర్మ వంటి వారు పోషిస్తున్నారు. మొత్తానికి 'మున్నాబాయ్‌ సిరీస్‌, త్రీ ఇడియట్స్‌, పీకే' చిత్రాలతో సంచలనాలు సృష్టించిన  రాజుహిరాణి 'సంజు' చిత్రంతో మరో సంచలనానికి రెడీ అవుతున్నాడు. 

Click Here for Teaser

Sponsored links

Sanju Teaser Released:

Sanjay Dutt Biopic Sanju Teaser Released

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019