రెండేళ్లవుతుంది హిట్టొచ్చి: మహేష్ బాబు!

Wed 25th Apr 2018 01:43 PM
mahesh babu,bharat ane nenu,hit,happy,tension  రెండేళ్లవుతుంది హిట్టొచ్చి: మహేష్ బాబు!
Mahesh Babu Speech at Bharat Ane Nenu Success Meet రెండేళ్లవుతుంది హిట్టొచ్చి: మహేష్ బాబు!
Sponsored links

సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను తో భారీ హిట్ అందుకున్నాడు. కొరటాల కూడా మహేష్ తో కలిసి రెండు హిట్స్ కొట్టాడు. ఇక ఇండస్ట్రీలో దర్శకుడిగా కొరటాలకు ఎదురులేదు. ప్రస్తుతం టాప్ లిస్ట్ లో ఉన్న కొరటాల తన స్థానాన్ని మరింత పెంచుకున్నాడు భరత్ అనే నేను హిట్ తో. మహేష్ కూడా కొరటాల మీద పెట్టుకున్న నమ్మకం నిజమైంది. ఎందుకంటే మహేష్ ఖచ్చితంగా భరత్ హిట్ పడాలి. లేదంటే స్పైడర్, బ్రహ్మ్మోత్సవం డిజాస్టర్స్ తో మహేష్ కి భరత్ అనే నేను హిట్ పడకపోతే.... హ్యాట్రిక్ ప్లాప్ కొట్టినట్లుగా అయ్యేది.

కానీ మహేష్ ఎప్పుడు తన సినిమాలు డిజాస్టర్ పై స్పందించలేదు. కానీ భరత్ అనే నేను సినిమా బంపర్ కలెక్షన్స్ కొల్లగొడుతుంటే... సినిమా విడుదలైన నాలుగో రోజున అంటే సోమవారం భరత్ టీమ్ సక్సెస్ సెలెబ్రేషన్స్ చేసుకుంది. భరత్ అనే నేను సినిమా హిట్ అందించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపిన మహేష్ బాబు భరత్ గురించి మాట్లాడుతూ... నేనెప్పుడూ చెప్పలేదు.. గత రెండేళ్లుగా నేను చాలా ఒత్తిడికి గురయ్యాను. కానీ ఇప్పుడు మాత్రం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అసలు భరత్ అనే నేను హిట్ పై ఎలా రియాక్ట్‌ అవ్వాలో కూడా తెలియట్లేదు.. అంతేకాకుండా నేను చాలా రిలీఫ్‌ అయ్యాను.. అంటూ స్పీచ్ ఇచ్చాడు.

అలాగే శ్రీమంతుడు వంటి హిట్ ఇచ్చిన కొరటాల శివ తనకి భరత్ అనే నేను తో మళ్ళీ హిట్ ఇచ్చి తన ఒత్తిడిని తగ్గించారని.... అలాగే సినిమా హిట్ కొట్టడానికి కృషి చేసిన భరత్ టీమ్ కి థాంక్స్ చెప్పేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.

Sponsored links

Mahesh Babu Speech at Bharat Ane Nenu Success Meet:

Mahesh Babu Happy with Bharat Ane Nenu Hit

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019