Advertisement

భరత్ కి మరో గుడ్ న్యూస్..!

Fri 20th Apr 2018 09:09 AM
bharat ane nenu,mahesh babu,extra shows,andhra pradesh government  భరత్ కి మరో గుడ్ న్యూస్..!
Bharat Ane Nenu Special Shows Permission Granted by AP Govt భరత్ కి మరో గుడ్ న్యూస్..!
Advertisement

సంక్రాంతికి విడుదలైన 'అజ్ఞాతవాసి, జైసింహా' చిత్రాలకు అదనపు షోలు వేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక ఇటీవల విడుదలైన రామ్‌చరణ్‌ 'రంగస్థలం'కు ఒక షో అదనంగా అంటే రోజుకి ఐదు షోలు వేసేందుకు పర్మిషన్‌ ఇచ్చింది. ఇప్పుడు మహేష్‌బాబు నటిస్తున్న 'భరత్‌ అనే నేను' చిత్రం కోసం కూడా ఐదు షోలకు ఓకే చెప్పింది. అయినా మామూలుగా సినిమా విడుదలకు ముందు రాత్రి నుంచే స్పెషల్‌ షోలు పడుతూ ఉంటాయి. కానీ 'భరత్‌ అనే నేను'కి ఆ అవకాశం లేదని అంటున్నారు. 

ఇక తెలంగాణలో అయితే ఆమద్య 'బాహుబలి' విషయంలో తప్ప ఎక్స్‌ట్రా షోకి టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అనుమతి ఇవ్వడం లేదు. ఇక 'భరత్‌ అనే నేను' చిత్రానికి గురువారమే యూఎస్‌లో ప్రీమియర్‌ షోలు పడనున్న నేపధ్యంలో తెలుగు రాష్ట్రాలలో బొమ్మ పడే సరికే టాక్‌ ఏమిటో తెలిసిపోతుంది. ఇక ఈ చిత్రం రిలీజ్‌ విషయంలో పలు ముఖ్యాంశాలు ఉన్నాయి. 20వ తేదీ తన తల్లి ఇందిరా దేవి పుట్టినరోజు అని మహేష్‌బాబు తెలిపాడు. ఇక అదే రోజు ఆంద్రా సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు కూడా. అంటే నిజమైన ఆంధ్రా సీఎం పుట్టినరోజు నాడే సినిమాలో సీఎంగా కనిపించనున్న భరత్‌ థియేటర్లలో రచ్చ రచ్చ చేయనున్నాడు. ఇక ఏపీలో 'భరత్‌ అనే నేను'కి 20వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఈ ఒక షో ఎక్కువగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

కాగా ఆమధ్య అదనపు షోల కోసం బయ్యర్లు, ఎగ్జిబిటర్లు కోర్టుకి వెళ్లిఎక్కువ బడ్జెట్‌తో రూపొందుతున్న తమ చిత్రాలకు అదనపు షోలకు అనుమతి ఇవ్వాలని, టిక్కెట్ల రేట్లు పెంచుకోవాలని కోరారు. దాంతో కోర్టు కూడా టిక్కెట్ల ధరలను నచ్చిన ధరకు అమ్ముకోవచ్చని చెబుతూనే, ఆ రేటుకి తగ్గట్లే పన్నులు ప్రభుత్వాలకు చెల్లించాలని చెప్పింది. ఇక మహేష్‌బాబు 'భరత్‌ అనే నేను' తర్వాత దిల్‌రాజు-అశ్వనీదత్‌ బేనర్‌లో తన 25వ చిత్రంగా వంశీపైడిపల్లి చిత్రంలో నటించనున్నాడు. దాని తర్వాత 'అర్జున్‌రెడ్డి' ఫేమ్‌ సందీప్‌రెడ్డి వంగాతో, మూడో చిత్రం సుకుమార్‌తో, మైత్రిమూవీమేకర్స్‌ సంస్థలో నటించడం దాదాపు ఖరారైపోయింది. 

Bharat Ane Nenu Special Shows Permission Granted by AP Govt:

Bharat Ane Nenu gets boost from AP government

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement