Advertisementt

మోక్షజ్ఞ లుక్ బయటికి వచ్చేసింది..!

Wed 18th Apr 2018 09:23 PM
mokshagna,balakrishna,son,chubby  మోక్షజ్ఞ లుక్ బయటికి వచ్చేసింది..!
Mokshagna Appears Flabby? మోక్షజ్ఞ లుక్ బయటికి వచ్చేసింది..!
Advertisement
Ads by CJ

సినిమా ఇండస్ట్రీలో సినిమా వారసుల ఎంట్రీ ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఏ భాష అయినా హీరోల పిల్లలు హీరోలుగానే ఎంట్రీ ఇస్తుంటారు. హీరోలుగా పనికిరారు అనుకునేవాళ్ళు ఏ ప్రొడక్షన్ రంగంలోనో లేదా ఇతర వ్యాపారాలకు వెళతారు. కానీ చాలా వరకు హీరోలుగా రావడానికే ట్రై చేస్తారు. ఎందుకంటే సినిమా సెలబ్రిటీ అంటే అంత క్రేజ్ కనక. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ వారసులు ఎక్కువగా వున్న ఈ టాలీవుడ్ ఇండస్ట్రీలో దగ్గుబాటి అక్కినేని, నందమూరి వారసులు చాలామందే ఉన్నారు. వారిలో కొందరు స్టార్ హీరోలయితే మరికొందరు మీడియం రేంజ్ హీరోగా ఉన్నారు.

ప్రస్తుతం ఇండస్ట్రీలోని నలుగురు సీనియర్ హీరోలలో ఇద్దరు హీరోల కొడుకులు హీరోలయ్యారు. వారిలో చిరు, నాగార్జున కొడుకులు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక మరో సీనియర్ హీరో వెంకటేష్ కొడుకు చిన్నవాడు. కానీ బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ ఎప్పుడెప్పుడంటూ అనేక రకాల వార్తలు మీడియాలో ఎప్పటికప్పుడు చదువుతూనే ఉన్నాం. అలాగే మోక్షజ్ఞ కూడా చాలా కాలంగా మీడియాకి చిక్కకుండా నటన, డాన్స్ లలో విదేశాల్లో శిక్షణ తీసుకుంటున్నాడని టాక్ ఉంది. అలాగే బాలకృష్ణ కూడా ఎప్పటికప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చెబుతున్నాడు కానీ పక్కా క్లారిటీ ఇవ్వడం లేదు.

అయితే చాలా కాలంగా మోక్షజ్ఞను ఎవరికీ కనబడకుండా రహస్యంగా వుంచుతున్నాడు బాలయ్య. అందరూ మెచ్చేలా మోక్షజ్ఞ సినిమా రంగ ప్రవేశం ఉంటుందని... నందమూరి ఫ్యాన్స్ మోక్షజ్ఞ చూసి గర్వంగా ఫీల్ అవుతారని చెబుతున్నాడు బాలయ్య. ప్రస్తుతం మోక్షజ్ఞ తన అక్క తేజస్వినికి బాబు పుట్టిన సందర్భంగా తన ఫ్యామిలీతో కలిసి కనబడ్డాడు. బాలయ్య భార్య వసుంధర, పెద్ద కూతురు బ్రహ్మణీ, మనవడు దేవాన్ష్, అలాగే బాలయ్య చిన్న కూతురు తేజస్విని బాబుతో మోక్షజ్ఞ ఉన్న ఫోటో ఇప్పుడు మీడియాలో హల్చల్ చేస్తుంది.

మరా పిక్ లో మోక్షజ్ఞని చూస్తుంటే ఇప్పుడప్పుడే సినిమాల్లోకి వచ్చే సీన్ మాత్రం కనబడడం లేదు. ఎదుకంటే ఆ పిక్ లో మోక్షజ్ఞ సినిమా హీరోకుండాల్సిన లక్షణాలతో లేడు. కాస్త ఒళ్ళు పెంచి లావుగా కనబడుతున్నాడు. మరి మోక్షజ్ఞ ఆ ఫొటోలో అలా ఎక్కువ బరువుతో కనబడేసరికి నందమూరి అభిమానుల ఫ్యూజులు ఎగిరిపోయాయి. మరి గత ఏడాది బాలయ్య ఏమో ఎమోషనల్ గా మోక్షు ఎంట్రీ 2018 జూన్ తర్వాత అన్నాడు. కానీ ఇప్పుడు మోక్షు ఉన్న ఆ లుక్ చూస్తుంటే మాత్రం మోక్షజ్ఞ సినిమా హీరో అవడానికి రెడీగా లేడనిపిస్తుంది. చూద్దాం వెండితెర అరగేంట్రం టైం కి ఏమన్నా తగ్గుతాడేమో.

Mokshagna Appears Flabby?:

Here is Chubby Mokshagna for You  

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ