Advertisementt

ఈ వ్యక్తిని ప్రేమిస్తున్నానంటున్న నమ్రత..!

Fri 06th Apr 2018 07:47 PM
namrata shirodkar,mahesh babu,love,bharat ane nenu,social media  ఈ వ్యక్తిని ప్రేమిస్తున్నానంటున్న నమ్రత..!
Namratha Sensational Post on Mahesh ఈ వ్యక్తిని ప్రేమిస్తున్నానంటున్న నమ్రత..!
Advertisement
Ads by CJ

'వంశీ' చిత్రం డిజాస్టర్‌ అయినా కూడా మహేష్‌బాబు, నమ్రతా శిరోద్కర్‌ల ప్రేమకి అదే ప్రధాన కారణం. ఆనాడు వారిద్దరు లవ్‌లో పడి, తర్వాత కుటుంబ సభ్యుల నుంచి కాస్త వ్యతిరేకత వ్యక్తమయినా కూడా మహేష్‌ అందరినీ ఎదిరించి ఆమెని వివాహం చేసుకున్నాడు. ఇక మహేష్‌ నాయనమ్మకి మాత్రం ఈ పెళ్లి ఇష్టం లేదు. జయంత్‌ సి.పరాన్జీ వంటి వారి ప్రోత్సాహంతో వీరి వివాహం జరిగింది. ఇక నమ్రతా కూడా మామూలు వ్యక్తికాదు. వేల కోట్లకి అధిపతి. ఆమె మహేష్‌ని వివాహం చేసుకుని తన వాటాగా 1500కోట్లు తీసుకొచ్చిందని అంటారు. ఇక మహేష్‌ సినిమాలు, యాడ్స్‌,ఇతర సేవా కార్యక్రమాలకు సమయం లేకపోతే అన్నింటినీ నమ్రతానే పక్కనుండి చూసుకుంటోంది. మహేష్‌కి చెందిన కాస్ట్యూమ్స్‌, కాల్షీట్స్‌, స్టోరీ వినడం, ఆయన దత్తత తీసుకున్న గ్రామాల అభివృద్ది వంటివన్నీ ఈమె చేతిలోనే ఉన్నాయి.

ఇక ఈమెకి పలు బిజినెస్‌ విషయాలలో దర్శకుడు మెహర్‌ రమేష్‌ సాయం చేస్తుంటాడని ఇండస్ట్రీలో అనుకుంటూ ఉంటారు. ఇక మహేష్‌ చిత్రాలకు సంబంధించిన ప్రమోషన్స్‌, కుటుంబం, పిల్లలతో గడిపే మధురానుభూతులను కూడా ఆమె యాక్టివ్‌గా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తోంది. వీరిద్దరికి గౌతమ్‌, సితార అనే పిల్లలు ఉన్నారు. తాజాగా నమ్రతా మహేష్‌కి సంబంధించిన ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ఈ వ్యక్తిని ప్రేమిస్తున్నానని తెలిపింది. దాంతో మహేష్‌ అభిమానులు కూడా ఆమె ట్వీట్‌కి స్పందించారు. మేము కూడా మహేష్‌ని ప్రేమిస్తున్నాం. మహేష్‌ సూపర్‌గా ఉన్నాడు. మీరు అదృష్టవంతులు అని కామెంట్స్‌ పెడుతున్నారు. ఇక మహేష్‌ నటించిన 'భరత్‌ అనే నేను' చిత్రం ఈనెల 20న విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. 

Namratha Sensational Post on Mahesh:

I love this Person, Says Mahesh Wife

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ