Advertisementt

ఎన్టీఆర్ కొత్త సినిమా లుక్ బయటికొచ్చేసింది!!

Fri 30th Mar 2018 01:27 PM
ntr,trivikram,ad shoot,ntr new look  ఎన్టీఆర్ కొత్త సినిమా లుక్ బయటికొచ్చేసింది!!
NTR’s New Look In Trivikram’s Film ఎన్టీఆర్ కొత్త సినిమా లుక్ బయటికొచ్చేసింది!!
Advertisement
Ads by CJ

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా అనేది ఎప్పటి మాటో.... వారి కాంబోలో సినిమా కూడా ఆఫీషియల్ గా స్టార్ట్ అయ్యింది. కానీ పట్టాలెక్కలేదు. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సెట్స్ మీదకెళ్ళిపోయాడు. కానీ అది వారి కాంబోలో తెరకెక్కబోయే సినిమా కోసం కాదండోయ్. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక యాడ్ షూట్ లో పాల్గొంటున్నాడు. అజ్ఞాతవాసితో దెబ్బతిన్న త్రివిక్రమ్ చాన్నాళ్ళకి ఇలా మళ్ళీ మెగా ఫోన్ పట్టాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఐపిల్ కి సంబంధించి ఒక యాడ్ షూట్ లో పాల్గొంటున్నాడు. అప్పుడే దానికి సంబందించిన షూటింగ్ వర్క్ కూడా మొదలైపోయింది.

ఎన్టీఆర్ తో సినిమా చెయ్యబోయే త్రివిక్రమ్ ముందుగా ఎన్టీఆర్ కి సంబందించిన యాడ్ షూట్ చేస్తున్నాడు. సినిమా కన్నా ముందే ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబో లో యాడ్ చూసెయ్యబోతున్నాం మనం. మరి త్రివిక్రమ్ సినిమా కోసం ఫుల్ గా మేకోవర్ అయిననా... ఇప్పుడు ఈ ఐపిఎల్ ప్రమోషన్ కోసం బయటికి వచ్చాడు. ప్రస్తుతం నగర శివార్లలో వేసిన సెట్స్ లో ఈ యాడ్ షూట్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఈ యాడ్ తో ఎన్టీఆర్ కొత్త సినిమా లుక్ పూర్తిగా రివీల్ అయిపోతుంది కాబట్టి సినిమాలో ఎలా ఉంటాడో అన్న సస్పెన్స్ ఇకపై ఉండదు అని మాత్రం చెప్పగలం.

ఇక సినిమా ఓపెనింగ్ చేసుకున్న చాలా నెలలకి ఇలా త్రివిక్రం, ఎన్టీఆర్ లు సెట్స్ మీద సందడి చెయ్యడం మాత్రం ఎన్టీఆర్ అభిమానులకు పిచ్చ హ్యాపీగా వుంది. కానీ అది సినిమా అయితే ఇంకా బావుండేదని... అయినా మా ఎన్టీఆర్ ని యాడ్ లో చూసి మురిపోతాం అంటున్నారు వారు. 

NTR’s New Look In Trivikram’s Film:

NTR, Trivikram Shoot IPL Promos

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ