Advertisementt

కె. ఎస్. రవికుమార్ కి మరో ఛాన్స్ ఇచ్చాడా?

Sat 24th Mar 2018 07:44 PM
balakrishna,k s ravikumar,combo,jai simha movie  కె. ఎస్. రవికుమార్ కి మరో ఛాన్స్ ఇచ్చాడా?
Balakrishna K S Ravikumar Combo Again కె. ఎస్. రవికుమార్ కి మరో ఛాన్స్ ఇచ్చాడా?
Advertisement
Ads by CJ

బాలకృష్ణ జోరు మాములుగా లేదు. ప్రస్తుతం తండ్రి బయోపిక్ ని పట్టాలెక్కించడమే కాదు తన తదుపరి చిత్రాన్ని బోయపాటి డైరెక్షన్ లో చేస్తాడనే ప్రచారం ఉండగా... కొత్తగా కొన్ని రోజుల నుండి కన్నడలో సూపర్ హిట్ అయిన 'మఫ్టీ' అనే సినిమాని తెలుగులో రీమేక్ చేస్తాడనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే బాలకృష్ణ నుండి ఈ న్యూస్ మీద ఎటువంటి స్పందన లేదుగాని బాలకృష్ణ ఈ కన్నడ 'మఫ్టీ' రీమేక్ చేస్తాడని మాత్రం ఖచ్చితంగా చెబుతున్నారు. కన్నడలో శివరాజ్ హీరోగా నటించిన ఈ 'మఫ్టీ' సినిమా అక్కడ 100  కోట్లు కొల్లగొట్టి రికార్డు సృష్టించింది.

100 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమాలో తెలుగులో బాలకృష్ణ - కె. ఎస్. రవికుమార్ లు కలిసి రీమేక్ చేయబోతున్నారని అంటున్నారు. వీరి కాంబోలో తాజాగా 'జై సింహా' అనే మూవీ వచ్చి యావరేజ్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్, బోయపాటి సినిమాల తర్వాత బాలకృష్ణ హీరోగా కె. ఎస్. రవికుమార్ ఈ 'మఫ్టీ' మూవీని రీమేక్ చేయనున్నారనే న్యూస్ వినబడుతుండగా.. కథ ప్రకారం బాలకృష్ణ ఈ సినిమాలో మాఫియా డాన్ గా కనిపిస్తాడట. మరి ఈ పాత్ర స్వభావం కొత్తగా ఉండటంతో బాలకృష్ణ ఈ సినిమా చెయ్యడానికి ఆసక్తి చూపుతున్నట్టుగా తెలుస్తుంది.

Balakrishna K S Ravikumar Combo Again:

Balakrishna Gives one more Chance to K S Ravikumar

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ