Advertisement

చిరంజీవితో ఉన్న బంధమిదే: తమ్మారెడ్డి!

Sat 17th Mar 2018 06:39 PM
tammareddy bharadwaja,chiranjeevi,relation,movies  చిరంజీవితో ఉన్న బంధమిదే: తమ్మారెడ్డి!
Relation between chiranjeevi and Tammareddy చిరంజీవితో ఉన్న బంధమిదే: తమ్మారెడ్డి!
Advertisement

దర్శకనిర్మాతగా తమ్మారెడ్డి భరద్వాజకి పెద్దగా హిట్స్‌ లేకపోవచ్చు గానీ కొత్తవారిని పరిచయం చేయడం, ప్రోత్సహించడంలో ఆయన అందరికంటే ముందుంటారు. మెగాస్టార్‌ చిరంజీవి నుంచి సుమన్‌, భానుచందర్‌, శ్రీకాంత్‌ నుంచి జెడిచక్రవర్తి, సుమంత్‌ వరకు ఆయన వారి కెరీర్‌ మొదట్లో చిత్రాలు తీశారు. ఇక ఈయన తీసే చిత్రాలు బాగా సామాజిక బాధ్యతతో కూడా కూడి ఉంటాయి. తన సినిమా ద్వారా ప్రజలకు ఏదో చెప్పాలనేది ఆయన లక్ష్యం. ఇక నాడు 'శివ' చిత్రం ఓ సంచలనం. కానీ 'శివ' టైప్‌లోనే ఆయన 'శివ' కంటే ముందే భానుచందర్‌, రాజేష్‌ వంటి వారితో 'అలజడి' చిత్రం తీశాడు. దురదృష్టవశాత్తు ఈ చిత్రం కంటే ముందు 'శివ' విడుదలైంది. 

ఇక రాయలసీమ ఫ్యాక్షనిజం నాడు ఎవర్‌గ్రీన్‌ సబ్జెక్ట్‌, చిరంజీవి, బాలకృష్ణ, మహేష్‌బాబు, వెంకటేష్‌ .. ఇలా అందరూ అదే బాటలో నడిచారు. కానీ రాయలసీమ ఫ్యాక్షనిజం ఓ మంచి కమర్షియల్‌ పాయింట్‌ అనే ఆలోచన మొదట వచ్చింది తమ్మారెడ్డికే. ఆయన శారద ప్రధాన పాత్రలో మోహన్‌బాబుతో 'కడప రెడ్డెమ్మ' చిత్రం తీశాడు. ఇక తాజాగా ఈయన మాట్లాడుతూ, చిరంజీవితో నాకు మంచి అనుబంధం ఉంది. కానీ చిరంజీవి గారితో మాత్రం అనుబంధం లేదు. నేను చిరంజీవి ఎంతో క్లోజ్‌గా ఉండేవాళ్లం. చిరంజీవి నన్ను 'అన్నయ్యా' అని పిలిచేవాడు. నేను 'ఒరేయ్‌' అని సంబోధించే వాడిని. అలాంటిది ఆయన అన్నయ్యా అనడం మానేశాడు. దాంతో నేను కూడా 'ఒరేయ్‌' అనడం మానేశాను. 'సార్‌ అనాల్సి వచ్చింది. సార్‌ అని కూడా అనేవాడిని. అంటే మా అనుబంధం బ్రేక్‌ అయినట్లే కదా..! ఆప్యాయతలు తగ్గిపోయినట్లే కదా..!అన్నయ్యా అంటూ ఆప్యాయంగా వచ్చేవాడు. ఎలా ఉన్నావురా అని భుజం మీద చేతులు వేసుకుని మాట్లాడుకునే వారం. అలాంటిది 'భరద్వాజ ఏంటి? అని ఆయన, 'చిరంజీవి ఏంటి' అనుకునే పరిస్థితి వచ్చిందంటే మనస్ఫూర్తిగా మాట్లాడుకునే పరిస్థితి లేనట్లే కదా...! అంటూ భావోద్వేగంతో చెప్పుకొచ్చాడు.

Relation between chiranjeevi and Tammareddy:

Tammareddy Bharadwaja About Relation with Chiranjeevi

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement