Advertisement

మోడీని.. ‘భరత్’ మాములుగా టార్గెట్ చేయలా..?

Sat 10th Mar 2018 11:23 AM
koratala siva,modi,bharat ane nenu,teaser  మోడీని.. ‘భరత్’ మాములుగా టార్గెట్ చేయలా..?
Koratala Siva Shocking Comments on Modi మోడీని.. ‘భరత్’ మాములుగా టార్గెట్ చేయలా..?
Advertisement

ప్రస్తుతం ఎక్కడ చూసినా కేంద్రంలోని బిజెపి సర్కార్‌, మోదీ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇప్పుడు ఇవ్వడం కుదరదు.. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాం.. అంటూనే ఆ ప్యాకేజీని కూడా ఇవ్వకుండా నాన్చుతున్న ధోరణిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కిందట రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు స్వయానా నాటి యూపీఏ ప్రధానమంత్రి పార్లమెంట్‌లో చేసిన ప్రత్యేకహోదా ప్రామిస్‌నే మోసం చేసినప్పుడు అసలు ఈ పార్లమెంట్‌లని, ప్రజాస్వామ్యాన్ని, రాజకీయ నాయకులను, రాజకీయ పార్టీలను ఎందుకు నమ్మాలి? పార్లమెంట్‌లో ఇచ్చిన మాటనే పట్టించుకోని వారు ఇతర హామీలను ఇచ్చినప్పుడు ప్రజలు వాటిని ఎలా నమ్ముతారు? అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఇక తాజాగా మహేష్‌బాబు, కొరటాల శివ దర్శకత్వంలో నిజమైన రాజకీయాలు, నాయకులు ఎలా ఉండాలి? అనే పాయింట్‌తో కొరటాల 'భరత్‌ అనే నేను' చిత్రం తీస్తున్నాదు. దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 20న విడుదల కానుంది. 

తాజాగా ఈ చిత్రం నుంచి విజన్‌ టీజర్‌ వచ్చి విపరీతంగా ఆట్టుకుంటోంది. తమిళంలో వచ్చిన 'మెర్సల్' తరహాలో మహేష్‌ 'భరత్‌ అనే నేను' చిత్రంలోని డైలాగ్స్‌, సీన్స్‌ కూడా కేంద్రంపై ఎక్కుపెట్టే విమర్శనాస్త్రాలుగా ఇందులోనివి ఉంటాయనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఈ టీజర్‌లో మహేష్‌ మాట్లాడుతూ, 'ఇచ్చిన ప్రామిస్‌ని ఒక మగాడిలా నిలబెట్టుకోవాలంటూ నా తల్లి నాకు నేర్పింది... అని హీరో క్యారెక్టర్‌ చెబుతుంది. ఒక్కసారి ప్రామిస్‌ చేసి ఆ మాట తప్పితే.. యూ ఆర్‌ నాట్‌ కాల్డ్‌ ఏ మేన్‌' అనే డైలాగ్‌ బాగా పేలింది. దీని గురించి సినిమాలో డైలాగ్‌ పెట్టడమే కాదు.. దర్శకుడు కొరటాల శివ ఆంధ్రప్రదేశ్‌కి మోడీ ఇచ్చిన ప్రామిస్‌ను నిలబెట్టుకుని మనిషిలా మారేలా మనమంతా ప్రయత్నించాలని కొరటాల శివ చేసిన ట్వీట్‌కి నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన లభిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలు ఇండియాలో భాగస్వామ్యం అని మీరు నమ్ముతున్నారా? అని కూడా కొరటాల శివ ప్రశ్నను సంధించడం మరీ కాకను రేపుతోంది. ఇక నెటిజన్లు మోదీ ప్రత్యేకహోదా విషయమే కాదు.. ఇతర విషయాలలో కూడా ఎన్ని ప్రామిస్‌లు చేశారో... వాటిని ఎలా గంగపాలు చేశారో వివరిస్తూ వివరిస్తున్నారు. మాట నిలబెట్టుకోని మోడీని ఏమనాలి?మీ నుంచి ఊహించని ట్వీట్‌ ఇది. ఇంకా అడగండి.. మోదీని కడిగిపారేయండి అని నెటిజన్లు కొరటాలను కోరుతున్నారు. 

మొత్తానికి 'ప్రామిస్‌' డైలాగ్‌ టాక్‌ ఆఫ్‌ ఇండియన్‌ పొలిటికల్‌లో ఓ రేంజ్‌లో హల్‌చల్‌ చేస్తుందనే చెప్పాలి. ఇక మహేష్‌ విషయానికి వస్తే ఆయనకు రాజకీయ వాసనలు పడవు. మరి మహేష్‌ చేత కొరటాల మరెన్ని పంచ్‌లు వినిపిస్తాడో చూడాలి...! ఇక కేవలం కేంద్రంలోని బిజెపినే కాకుండా ఏపీకి మోసం చేసిన టిడిపి, వైసీపీలను కూడా కొరటాల కడిగిపారేసి ఉంటే బాగుండేదని, ఆ ధైర్యం కొరటాల చేశాడా? లేదా? అన్నది సినిమా చూస్తే గానీ తెలియదు. 

Koratala Siva Shocking Comments on Modi:

Koratala Siva Wants to Make Modi a Man

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement