నందమూరి పెద్దోడు బిజీగా ఉన్నాడు!

Wed 07th Mar 2018 04:43 PM
kalyan ram,millinaire,kona venkat,mla,naa nuvve  నందమూరి పెద్దోడు బిజీగా ఉన్నాడు!
kalyan ram signs one more movie నందమూరి పెద్దోడు బిజీగా ఉన్నాడు!
Sponsored links

నందమూరి హరికృష్ణ తనయుల్లో యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ బుడ్డోడు అయితే నందమూరి కళ్యాణ్‌రామ్‌ పెద్దోడు. ఇక నందమూరి కళ్యాణ్‌రామ్‌కి హీరోగా 'అతనొక్కడే. పటాస్‌' చిత్రాలు మాత్రమే హిట్‌. కమర్షియల్‌గా పెద్దగా విజయం సాధించకపోయినా కూడా కళ్యాణ్‌రామ్‌ నటించిన 'హరేరామ్‌' మంచి చిత్రంగా ప్రశంసలు పొందింది. ఇక 'కిక్‌ 2'తో నిర్మాతగా బోలెడు నష్టాలు చవిచూసిన కళ్యాణ్‌రామ్‌ తన తమ్ముడు నటించిన 'జైలవకుశ' తో మాత్రం లాభాల బాట పట్టాడు. ఇక రొటీన్‌ చిత్రాలంటే జనం చూడరని ఇప్పటికైనా ఆయన గుర్తించాడు. దాంతో ప్రస్తుతం ఆయన ఉపేంద్ర మాధవ్‌ దర్శకత్వంలో 'ఎమ్మెల్యే' (మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి'గా) రానున్నాడు. 

ఇక కాస్త పొలిటికల్‌ టచ్‌ ఉన్న లవ్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం లిరికల్‌ సాంగ్‌, టీజర్లు ఆకట్టుకుంటున్నాయి. ఇందులో తన మొదటి హీరోయిన్‌ చందమామ కాజల్‌కి వానలో గొడుగు పడుతున్న కళ్యాణ్‌రామ్‌ హెయిర్‌స్టైల్‌ నుంచి మీసపు కట్టు వరకు ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు జయేంద్ర దర్శకత్వంలో తమన్నాతో కలిసి 'నా నువ్వే' చిత్రం చేస్తున్నాడు. దీనికి పి.సి.శ్రీరాం సినిమాటో గ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. ఈ విధంగా చూసుకుంటే కళ్యాణ్‌రామ్‌ తాజాగా చేస్తున్న 'ఎమ్మెల్యే, నానువ్వే' చిత్రాలు రెండు ప్రామిసింగ్‌గా అనిపిస్తున్నాయి. 

'నా నువ్వే' చిత్రం మే 25న విడుదల కానుండగా, మరికొన్ని రోజుల్లోనే 'ఎమ్మెల్యే'గా కళ్యాణ్‌రామ్‌ మన ముందుకు రానున్నాడు...! ఇక ఈ రెండు చిత్రాల అనంతరం కళ్యాణ్‌రామ్‌ మరో రెండు సినిమాలను లైన్‌లో పెట్టుకున్నాడు. ముందుగా ఓ కొత్త దర్శకునితో 'మిలియనీర్‌' అనే చిత్రాన్ని పట్టాలెక్కించి, ఆ వెంటనే పవన్‌ సాధినేని దర్శత్వంలో మరో చిత్రం చేయనున్నాడు. ఇందులో మొదటగా కొత్త దర్శకుడి 'మిలియనీర్‌' పట్టాలెక్కనుంది.

Sponsored links

kalyan ram signs one more movie:

kalyan ram became millionaire by kona venkat    

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019