Advertisementt

నాని.. అందుకు అర్హుడు కూడా!

Mon 05th Mar 2018 11:43 AM
nani,remuneration,hike,cheque  నాని.. అందుకు అర్హుడు కూడా!
Nani Hikes Pay Cheque? నాని.. అందుకు అర్హుడు కూడా!
Advertisement
Ads by CJ

న్యాచురల్ స్టార్ నాని నటించిన 'ఎంసీఏ' సినిమా యావరేజ్ కంటెంట్.... కానీ మంచి సక్సెస్ సాధించింది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 50 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. యావరేజ్ సినిమాను హిట్ చేసే స్టామినా వున్న నానితో సినిమాలు చేయడానికి ఎక్కువ మంది ప్రొడ్యూసర్స్ ఎదురు చూస్తుంటారు.

ఇప్పుడు ఈ యంగ్ హీరో రేంజ్ కూడా పెరిగిపోయింది అందుకు తగ్గట్టుగానే పారితోషికం కూడా పెంచేశాడట. ఇప్పుడున్న సినిమాలు వదిలేసి.. నెక్స్ట్ వచ్చే మూవీస్ కి ఏకంగా 9 కోట్ల పారితోషికం అడుగుతున్నాడట. నాని సినిమా అంటే కనీసం 25-30 కోట్ల షేర్ గ్యారంటీ అనే రేంజ్ లో సినిమాలు ఆడుతుండడంతో.. ఈ ఫిగర్ కు పెద్దగా అభ్యంతరాలు రావడం లేదని అంటున్నారు.

ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తున్నాడు నాని. ఈ ఏడాదిలో కూడా మూడు సినిమాలు వున్నాయి . సినిమాకు 9 కోట్ల చొప్పున.. ఎలా చూసుకున్నా మినిమం ఏడాదికి నాని దాదాపుగా 25 కోట్ల రూపాయలను రెమ్యూనరేషన్ గా అందుకునే అవకాశాలున్నాయి.

Nani Hikes Pay Cheque?:

Nani's Remuneration Hiked?

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ