ఈమెని మెచ్చుకోవాల్సింది పోయి...విమర్శలా?

Sat 03rd Mar 2018 10:06 PM
gilu joseph,breastfeeding,cover page,grihalakshmi,magazine  ఈమెని మెచ్చుకోవాల్సింది పోయి...విమర్శలా?
Grihalakshmi cover photo controversy ఈమెని మెచ్చుకోవాల్సింది పోయి...విమర్శలా?

మగవారి దృష్టిలో మహిళ ప్రకృతితో సమానంగా భావిస్తారు. అందునా సృష్టికి మూలమైనదిగా మహిళనే చెప్పాలి. అందుకే అమ్మని మించి దైవమున్నదా..? ఆత్మను మించి అద్దమున్నదా? అని ఓ కవి అంటాడు. కానీ మన సమాజంలో, సినిమాలలో నటీమణులు అంటే కేవలం గ్లామర్‌ డాల్స్‌, వారిలోని, వారి శరీరంలోని ఎద, బొడ్డు, పిల్లలకు జన్మనిచ్చే మర్మాంగాలను మనం కేవలం సెక్స్‌వల్‌ కోణంలోనే చూస్తాం. కానీ బిడ్డ కడుపులో ఉన్నప్పుడు వారికి ఆహారం అందించే బొడ్డును మాత్రం పాశ్చాత్య దేశాలలో కూడా శృంగారంగా చూపించరు. పోర్న్‌ సినిమాలలో కూడా బొడ్డు జోలికిపోరు. ఇక ఆడదానికి అమ్మతనం, మాతృత్వం అందించే ఆనందం ఎంతో గొప్పది, తల్లి కావడంతోనే ఓ మహిళ జన్మ పరిపూర్ణం అవుతుంది. కానీ కొందరు ఈ తరం మహిళలను పిల్లలకు ముర్రెపాలు, పసితనంలో తల్లిపాలు ఇస్తే తమ అందం తరిగిపోతుందని భావిస్తూ, పిల్లలను కూడా సరోగసీ ద్వారా కంటున్నారు. 

ఇక పిల్లలకు పాలిచ్చే తల్లుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. కానీ ఈ విషయంలో మలయాళంలోని 'మాతృభూమి' అనే మేగజైన్‌ 'గృహలక్ష్మి' అనే క్యాంపెయిన్‌ని స్టార్ట్‌ చేసింది. ఇందులో ఓ వనిత జాకెట్‌ని తొలగిస్తూ ఓ పాపకి పాలిస్తున్న ఫొటోని కవర్‌పేజీగా వేసి, అందులోని ఫొటో, కాన్సెప్ట్‌తో సంచలనం సృష్టిస్తోంది. మహిళలను ప్రతి విషయంలోనూ సెక్స్‌వల్‌ ఆబ్జెక్టివ్ గా చూడవద్దని, బ్రెస్ట్‌ ఫీడింగ్‌ కోసమే ఈ భాగాలు ఉన్నాయనే క్యాప్షన్‌ని అందించింది. ఇంత ధైర్యం చేసిన మలయాళ వనిత సింగర్‌ కం రైటర్‌ కం యాక్టర్ అయిన గిలు జోసెఫ్‌. దీనిని అభినందించాల్సిందిపోయి కొందరు చాందసవాదులు మాత్రం ఆమెపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. 

పెళ్లి కాని యువతి ఇలాంటి స్టిల్‌ ఎందుకు ఇచ్చింది.? ఇది సమాజం ఉద్దరించడానికి కాదు... కేవలం తన క్రేజ్‌ని పెంచుకుని వార్తల్లో నిలిచేందుకే అని కొందరు విమర్శిస్తున్నారు. దీనికి ఆమె సమాధానం ఇస్తూ.. నేను ఈ ఫొటో దిగినందుకు నయాపైసా రెమ్యూనరేషన్ తీసుకోలేదు. ఇది పబ్లిక్‌ స్టంట్‌ ఎలా అవుతుంది? అందాలను చూడటానికి, గ్రాఫిక్‌ ఫొటోలను చూడటానికి ఇష్టపడే వారు ఓ తల్లి బిడ్డకు పాలివ్వడం మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్నటి వరకు నన్ను అభిమానించిన వారే నేడు నన్ను నీతి తప్పిన దానిలా, వేశ్యగా చూస్తున్నారు అంటూ మండిపడింది.

Grihalakshmi cover photo controversy:

Case filed against Grihalakshmi, Gilu Joseph for breastfeeding cover