Advertisement

అతిలోక సుందరికి దక్కిన గౌరవం....!

Thu 01st Mar 2018 11:40 PM
sridevi,last rites,state honours,mumbai  అతిలోక సుందరికి దక్కిన గౌరవం....!
Sridevi Last Rites Details అతిలోక సుందరికి దక్కిన గౌరవం....!
Advertisement

పుట్టిన వాడికి మరణం తధ్యం. మరణించిన వాడికి మరోజన్మ తప్పదు అని మన వేదాలు, భగవద్గీత చెబుతున్నాయి. ఇక శ్రీదేవి విషయానికి వస్తే ఆమె దేవకన్య అని, ఆమెకి మరణం ఏమిటని కొందరు బాధ వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి.అశేష అభిమానగణం కన్నీటి సాక్షిగా ఆమె అంత్యక్రియలు జరిగాయి. ఆమె అంత్యక్రియలలో దక్షిణాది సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులే కాదు.. బాలీవుడ్‌ ప్రముఖులు కూడా హాజరయ్యారు. మొత్తంగా ఈ అంత్యక్రియలకు 25 వేలమంది హాజరయ్యారు. ఆమె పార్ధివదేహం ప్రయాణించిన ఏడు కిలోమీటర్ల వరకు అభిమానులు బారులుతీరారు. అంధేరిలోని లోకండ్‌వాలా కాంప్లెక్స్‌ నుంచి జుహూ వరకు ఈ యాత్ర సాగింది. ఆమెని చూసేందుకు ప్రజలు భవంతుల మీదకిఎక్కి కిక్కిరిసి పోవడంతో పోలీసులు ఆదుర్ధా పడ్డారు.

దాంతో కేవలం ఈ అంతిమ యాత్రకు శ్రీదేవి బంధువులకు చెందిన 12 కార్లను మాత్రమే అనుమంతిచారు. ఇక ఈమెకి తెలుపు రంగు ఇష్టం కావడంతో ఎక్కడ చూసినా తెలుపు రంగే కనిపించింది. ఇక ఈమెకి ఎరుపురంగు అంటే మరీ ముఖ్యంగా అందంగా ఉండటం అంటే చాలా ఇష్టం. దాంతో ఆమె భౌతిక దేహానికి ఎరుపురంగు చీరను కట్టారు. కాంజీపురం పట్టుచీరలు అంటే శ్రీదేవికి ఎంతో ఇష్టం. దాంతో ఆమెదేహంపై ఎర్రని, బంగారు వర్ణ చీరను కట్టడంతోపాటు ఆమెకిష్టమైన తెలుపురంగులోనే అన్నిఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆమె మరణించినా కూడా విడిపడిన పెదాలు తప్ప ఆమె మొహం ఎంతో నిర్మలంగా, ప్రశాంతంగా ఉంది. ఎరుపురంగు లిప్‌స్టిక్‌ని వేశారు.

ఇక ఈమె అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. ముందుగా ఆమెపై త్రివర్ణ పతాకం జెండాను కప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో ఈ కార్యక్రమాన్నిజరిపించింది. పోలీసులు బ్యాండ్‌ సంగీతంతో నివాళులు అర్పించింది. ఇలా పద్మశ్రీ అవార్డు గ్రహీతల్లో ఎవ్వరికీ లభించని అరుదైన గౌరవం శ్రీదేవికి మాత్రమే దక్కిందని చెప్పవచ్చు.

Sridevi Last Rites Details:

Sridevi To Be Cremated With State Honours In Mumbai    

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement