Advertisement

ఎన్టీఆర్‌ కావాలంటూ బాబుకి షాకిచ్చారు..!

Thu 01st Mar 2018 10:17 PM
chandrababu naidu,jr ntr,tdp,telangana,tdp leaders  ఎన్టీఆర్‌ కావాలంటూ బాబుకి షాకిచ్చారు..!
Jr NTR’s Name Proposed For Telangana TDP President Post ఎన్టీఆర్‌ కావాలంటూ బాబుకి షాకిచ్చారు..!
Advertisement

నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత వారి వారసుల చేతికి కాకుండా అల్లుడైన నారాచంద్రబాబు నాయుడు చేతికి చిక్కింది. ఇక చంద్రబాబు సీఎం అయిన తర్వాత కొంతకాలం నందమూరి కుటుంబ సభ్యులకు ప్రాధాన్యం లభించింది. హరికృష్ణ ఎంపీగా కూడా పనిచేశాడు. కానీ చంద్రబాబు తర్వాత టిడిపి పగ్గాలు బాలయ్య కంటే ఎక్కువ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న జూనియర్‌ ఎన్టీఆర్‌ చేతికి పోతాయని బాబు గ్రహించాడు. అయినా సరే ఎన్నికల్లో ఎన్టీఆర్‌ బలం ఏమిటో తెలుసుకోవడానికి ఆయనకు కొన్ని జిల్లాలలో ప్రచార బాధ్యతలను అప్పగించాడు. కానీ ఎన్టీఆర్‌ ప్రచారం చేసిన స్థానాలలో టిడిపి విజయం సాధించలేదు. దాంతో బాలయ్యతో బంధుత్వం కలుపుకుని తన కుమారుడు, బాలయ్య అల్లుడు లోకేష్‌ని తన వారసునిగా ప్రకటించాడు. దానికి లోకేష్‌ కూడా తన అల్లుడే కాబట్టి బాలయ్య సైతం కాదనలేకపోయాడు. బాలయ్యని ఎమ్మెల్యేని చేశాడు. 

కానీ హరికృష్ణ విషయంలో మాత్రం ఆయనకు సాధ్యమైనంత ప్రాధాన్యం ఇవ్వకుండా బాబు చేయగలిగాడు. దీంతో తమ దగ్గరి స్నేహితులైన ఎమ్మెల్యేలను ఎన్టీఆర్‌, హరికృష్ణ కలిసి వైసీపీలోకి పంపారని వార్తలు వచ్చాయి. ఆ ఎమ్మెల్యేలకు ఎన్టీఆర్‌, హరికృష్ణలతో ఉన్న అనుబంధం చూస్తే ఎవరికైనా అదే అనుమానం వస్తుంది. ఇక కొంతకాలం పెద్దగా సంబంధాలు లేని హరికృష్ణ, నందమూరి కళ్యాణ్‌ రామ్ లు ఎన్టీఆర్‌కి దగ్గరయ్యారు. ఇక నందమూరి ఫ్యామిలీలో బాలకృష్ణ తప్ప దగ్గుబాటి పురందరేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు నుంచి ఎవ్వరికీ చంద్రబాబు అంటే పడదు. ఇక తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత తెలంగాణలో టిడిపి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. టిడిపి నాయకులందరూ టీఆర్‌ఎస్‌ లేదా కాంగ్రెస్‌ పంచన చేరారు.

ఇక హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో లోకేష్‌కి టిడిపిని గెలిపించే బాధ్యత అప్పగించినా ఈ పప్పు బోర్లాపడ్డాడు. కుడి భుజం వంటి రేవంత్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌ గూటికి చేరాడు. దాంతో ఈసారి తెలంగాణ టిడిపి బాధ్యతలను జూనియర్‌ ఎన్టీఆర్‌కి అప్పగించాలనే వాదన వినిపిస్తోంది. తాజాగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో కార్యకర్తలు చంద్రబాబు ఎదుటే తెలంగాణ టిడిపి పగ్గాలు ఎన్టీఆర్‌కి ఇవ్వాలని నినాదాలు చేశారు. ఇక టిడిపిని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తే ఆత్మహత్యలు చేసుకుంటామన్నారు. టిఆర్‌ఎస్‌తో పాటు బిజెపితో కూడా పొత్తు వద్దని వారు చంద్రబాబుకి సూచించారు. చంద్రబాబు వారిని సముదాయించి పార్టీ శ్రేణుల మనోభిప్రాయాలకు అనుగుణంగానే పొత్తు ఉంటాయని చెప్పాడు. 

ఇక ఎన్టీఆర్‌కి తెలంగాణ బాధ్యతలు ఇవ్వడం అంటే అది ఎన్టీఆర్‌ నెత్తిన భస్మాసుర హస్తమే అవుతుంది. అదేదో జూనియర్‌కి ఆంధ్రాలో బాధ్యతలు ఇచ్చి లోకేష్‌కి తెలంగాణ బాధ్యతలు ఇవ్వవచ్చు కదా...! అనే సెటైర్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఎన్టీఆర్‌ పగ్గాలు చేపట్టినా టిడిపికి తెలంగాణలో భవిష్యత్తు లేదని అర్ధమవుతోంది. మరి ఈ విషయంలో ఎన్టీఆర్‌ మనోభావాలు ఎలా ఉన్నాయో తెలియాల్సివుంది.

Jr NTR’s Name Proposed For Telangana TDP President Post:

>Chandrababu Shocked To Hear Jr NTR’s Name

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement