Advertisement

పవన్‌తో వామపక్షాలు నడవడం ఖాయం!

Thu 01st Mar 2018 09:14 PM
pawan kalyan,k rama krishna,janasena party office,ap cpi secretary  పవన్‌తో వామపక్షాలు నడవడం ఖాయం!
AP CPI Proposes With Janasena Party పవన్‌తో వామపక్షాలు నడవడం ఖాయం!
Advertisement

కమ్యూనిజం నిజంగా గొప్పది, పేద, ధనిక, మద్యతరగతి వంటి అందరికీ, ముఖ్యంగా పేద, మద్యతరగతి వర్గాలకు అనుకూలంగా ఆ పార్టీ ఉంటుంది. ఓ గొప్ప నాయకుడు చెప్పినట్లు కమ్యూనిజం మంచిదే గానీ కమ్యూనిస్ట్‌లు మాత్రం మంచి వారు కాదు అనేది సత్యం. ఇక దేశంలో మనం ఎంతో కాలం కాంగ్రెస్ పాలన చూశాం. మోదీ రూపంలో పూర్తి మెజార్టీ వస్తే, పేదలను, మధ్యతరగతిని ఇబ్బంది పెట్టి వ్యాపార పారిశ్రామిక వేత్తలకు, డబ్బున్న వారికి బిజెపి ఎంత నిసిగ్గుగా సహాయం చేస్తోందో అర్ధమైంది. ఇక కాంగ్రెస్‌, బిజెపి దొందు దొందే అనే పక్షంలో ఇకసారైనా కమ్యూనిజం పాలన కూడా ఎలా ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంది. వారిది  దేశీయ నినాదం. కాంగ్రెస్‌, బిజెపిలు స్టార్‌ మార్కెట్‌ సూచిని చూసి ఇదే అభివృద్ది అని చెబుతారు కానీ ఆ సిద్దాంతాన్ని కమ్యూనిస్ట్‌లు నమ్మరు. రష్యాలో కమ్యూనిజం విఫలమై ఉండవచ్చు. కానీ నిజమైన కమ్యూనిజంని నడిపిస్తే ఎలా ఉంటుందో చైనా వంటి దేశాలు నిరూపిస్తున్నాయి. 

ఇక కమ్యూనిస్ట్‌లలో జ్యోతిబసు అన్నేళ్లు బెంగాల్‌ని ఏలాడంటే.. ఇక సోమ్‌నాథ్‌ చటర్జీ, సుర్జీత్‌ సింగ్‌, మాణిక్‌ సర్కార్‌ వంటి వారు ఎంతటి సమర్ధులో తెలిసిందే. కానీ వారు ప్రధాన మంత్రిలు కాలేకపోయి మిన్నకుండి పోయారు. కాబట్టి వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్‌, బిజెపిలను కాదని, వామపక్షాల సాయంతో తృతీయఫ్రంట్‌ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుంది? అనే చర్చ సాగుతోంది. ఈ సారి ఆరు దక్షిణాది రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు గెలిస్తే అది పెద్ద కష్టమేమీ కాదు. ఒకవైపు రజనీ, కమల్‌, మరోవైపు పవన్‌, కోదండరామ్‌ వంటి వారు కలిసి ఉండాల్సిన పరిస్థితి ఉంది. 

ఇక వామపక్షాలు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుని పంచన చేర్చే విషయంలో సుముఖంగా లేరు. కారణం చంద్రబాబు అవకాశవాది, వీలుంటే బిజెపితో సై అంటాడు. లేదంటే కమ్యూనిస్ట్‌ల కాళ్లు పట్టుకుంటాడు. ఆయన నిజమైన శాశ్వత మిత్రుడు కాదు. అయినా పవన్‌ మద్యవర్తిత్వంతో ఈసారి టిడిపి, వామపక్షాలు, జనసేన, కోదండరామ్‌ వంటి వారు కలిసి దక్షిణాదిన సత్తా చూపాల్సివుంది. దీనికి తగ్గట్లుగానే తాజాగా సిపిఐ రామకృష్ణ తమ మనసులోని మాటలను బయట పెట్టాడు. పవన్‌ కూడా తమ దారిలోనే ఉన్నారని, ఆయనతో కలసి నడిచే ఆలోచనలో ఉన్నామని చెప్పాడు. ఉభయ కమ్యూనిస్ట్‌ పార్టీలు దేశ, రాష్ట్ర రాజకీయాలను పరిశీలించిన తర్వాత ఓ నిర్ణయానికి వస్తామని తెలిపారు. 

కూటమిలో ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు? అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదని, కానీ పవన్‌ మాత్రం తమ కూటమిలో ఉంటాడని పరోక్ష సంకేతాలిచ్చాడు. ప్రధాని మోదీ ఏపీని పూచికపుల్లగా చూస్తున్నాడని, చంద్రబాబు మాటలను అసలు కేర్‌ చేయడం లేదని తెలిపాడు. ఇక పవన్‌ వైసీపీతో వెళ్లే అవకాశం లేని పరిస్థితుల్లో వామపక్షాలు వైసీపీతో సాగే కంటే పవన్‌తో సాగడమే బాగుంటుందనే ఆలోచనలు సాగుతున్నాయి.

AP CPI Proposes With Janasena Party:

AP CPI Secretary K Rama Krishna Met JanaSena Party Chief Pawan Kalyan at Party Office

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement