Advertisement

శ్రీదేవి త్యాగం ఫలించలేదు..!

Wed 28th Feb 2018 12:13 PM
sridevi,srilatha,maheswari,vajraladonga,mega star  శ్రీదేవి త్యాగం ఫలించలేదు..!
Sridevi greatness Revealed శ్రీదేవి త్యాగం ఫలించలేదు..!
Advertisement

శ్రీదేవితో తన కెరీర్‌ మొదట్లో చిరంజీవి 'రాణి కాసుల రంగమ్మ'తో పాటు కొన్ని చిత్రాలు చేశాడు. ఇక చిరంజీవి మెగాస్టార్‌ అయిన తర్వాత ఆమెతో 'జగదేకవీరుడు అతిలోక సుందరి' చేశాడు. శ్రీదేవి తెలుగులో నటించిన చివరి చిత్రం కూడా చిరుదే. చిరంజీవి, శ్రీదేవి నటించిన 'ఎస్పీపరుశురాం' ఆమె నటించిన తెలుగులో చివరి చిత్రం. ఇక ఈమె ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, కృష్ణ,శోభన్‌బాబు వంటి వారి చిత్రాలలో బాలనటిగా నటించి. ఆ తర్వాత వారి సరసనే హీరోయిన్‌గా చేసింది. ఈమె శోభన్‌బాబు నటించిన 'నా తమ్ముడు' చిత్రంలో బాలనటిగా నటించగా, 'కార్తీకదీపం' చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఇక సావిత్రి, భానుమతి తర్వాత ఆస్థాయి నటీమణి శ్రీదేవి మాత్రమే. 

ఇక ఈమె చిన్నప్పుడు సూపర్‌స్టార్‌ కృష్ణ ఇంటిలోనే పెరిగింది. మద్రాస్‌లో నాడు కృష్ణ ఇంటి పక్కనే శ్రీదేవి ఫ్యామిలీ ఇల్లు కూడా ఉండేది. కృష్ణతో ఆమె అత్యధికంగా 31 చిత్రాలలో నటించింది. ఇక శ్రీదేవికి ఓ సోదరితోపాటు,.. ఇద్దరు సవతి సోదరులు కూడా ఉన్నారు. ఇక ఈమె తన సోదరి శ్రీలతని హీరోయిన్‌ని చేయాలని భావించింది. చిరంజీవి సైతం శ్రీలత తొలి చిత్రంలో నటించేందుకు ఒప్పుకుని డేట్స్‌ ఇచ్చాడు. ఈ చిత్రం పేరు 'వజ్రాలదొంగ'. కోదండరామిరెడ్డి దర్శకుడు. ఈ చిత్రం ఓపెనింగ్‌ నాటి తమిళ దిగ్గజం,తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ ఎమ్జీఆర్‌ చేతుల మీదుగా జరిగింది. కానీ ఆ తర్వాత ఈ చిత్రం ఆగిపోయింది. 

ఇక ఈమె కజిన్‌ మహేశ్వరి కూడా 'గులాబి, నీకోసం, అమ్మాయి కాపురం' వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ఈమె విషయంలోనే జెడిచక్రవర్తి, కృష్ణవంశీలకు తగవు జరిగింది. ఇలా ఈమె తన సోదరి, కజిన్‌లకు చాన్స్‌లు ఇప్పించే ప్రయత్నంచేసినా రాణించలేకపోయారు. 

ఇక శ్రీదేవిని తన 'జీరో' చిత్రంలో నటించమని షారుక్‌ అడిగాడట. అందులో ఓ కీలక పాత్రలో, నటి శ్రీదేవిగానే ఆమె పాత్ర కామియోగా ఉంటుంది. ఈ పార్ట్‌ సినిమా షూటింగ్‌ ఇంకా జరగలేదని కొందరు అంటుంటే... ఆమె ఆల్‌రెడీ ఆ చిత్రంలో నటించిందని, ఈమె చివరి చిత్రం 'మామ్‌' కాదు 'జీరో' అని కొందరు అంటున్నారు. ఇక శ్రీదేవిని నటిని చేయమని చెప్పింది తమిళనాడు మాజీ సీఎం కామరాజ్‌నాడార్‌. శ్రీదేవి తండ్రి అయ్యప్పన్‌, ఆయన స్నేహితుడు ఇరువురు కాంగ్రెస్‌ పార్టీ వారు. ఒకరోజు తమ వెంట శ్రీదేవిని తీసుకెళ్తే ఈమె గొప్పనటి అవుతుందని చెప్పి కామరాజ్‌ నాడారే ఆమెకి నటిగా అవకాశం ఇప్పించాడు.

Sridevi greatness Revealed:

Sridevi stayed back to be with her sister

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement