'నేల టికెట్' సినిమా షూటింగ్ లో హీరో రవితేజ గాయపడినట్టు తెలుస్తుంది. మోనో వీల్ డ్రైవ్ చేస్తుండగా అది అదుపు తప్పడంతో రవితేజ కింద పడిపోయారంట. ఓ మోస్తరుగా బాగానే గాయాలయినట్టు టాక్. ట్రీట్మెంట్ కోసం వెంటనే దగ్గరున్న హాస్పిటల్ కి తీసుకెళ్ళారంట.
అయితే మోనో వీల్ నడపడం కోసం డూప్ ని పెడదాం అని డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ముందే చెప్పారంట. కానీ రవితేజ మాత్రం రిస్క్ తీసుకోవడానికే సిద్ధపడినట్టు తెలిసింది. దీని గురించి ఆందోళన చెందవలసిన పనిలేదని చెబుతున్నారు చిత్ర యూనిట్.
'టచ్ చేసి చూడు' షాక్ నుండి ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్న రవితేజ ఇలా జరగడం ఫ్యాన్స్ బాధపడుతున్నారు. నేల టికెట్ కథపై ఏమి లీక్ ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్న యూనిట్ ఇది పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్నట్టు వినికిడి. అయితే రవితేజ జరిగిన ఈ యాక్సిడెంట్ గురించి ఎటువంటి అఫిషియల్ న్యూస్ ని చిత్ర యూనిట్ తెలుపలేదు.