Advertisement

బిగ్‌బి హాస్యచతురత అదిరింది..!

Mon 26th Feb 2018 11:33 AM
amitabh bachchan,poem,twitter,big b  బిగ్‌బి హాస్యచతురత అదిరింది..!
Amitabh Bachchan dedicates a poem to Twitter బిగ్‌బి హాస్యచతురత అదిరింది..!
Advertisement

ఈమద్య బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌కి ట్విట్టర్‌లో ఉన్న ఫాలోయర్స్‌ సంఖ్యని రాత్రికి రాత్రి 2లక్షలు తగ్గించి, షారుఖ్‌ని హైలేట్‌ చేయడంతో బిగ్‌బి కోపంతో ట్విట్టర్‌ని వదిలేస్తానని హెచ్చరించాడు. దాంతో స్వయంగా అమితాబ్‌ వంటి వ్యక్తి, మోదీ తర్వాత రెండో స్థానంలో ఉన్న బిగ్‌బి ట్విట్టర్‌ నుంచి తప్పుకుంటే నష్టం అని భావించిన ట్విట్టర్‌ టీం ప్రతినిధులు అమితాబ్‌ ఇంటికి స్వయంగా వెళ్లి, ఆ విషయంలో వివరణ ఇచ్చి ఆయనతో ఓ ఫొటో కూడా దిగారు. 

ఇక అమితాబ్‌ ట్విట్టర్‌లో ఎంతో యాక్టివ్‌గా ఉంటాడు. సినిమా అప్‌డేట్స్‌, పాత జ్ఞాపకాల నుంచి ఇంట్లో జరిగే విషయాలను కూడా తన అభిమానులతో ఆయన పంచుకుంటాడు. తాజాగా ఈయన ట్విట్టర్‌పై ఓ కవిత రాశాడు. ముందుగా ఆయన ట్వీట్‌ చేస్తూ, అరే తమ్ముడు, లేదా అక్కయ్యా, మీ జెండర్‌ నాకు తెలియదు కాబట్టి రెండింటితో సంబోధిస్తున్నాను. నేనేదో రాద్దాం అనుకుంటాను. అందుకు నువ్వు రాద్దాంతం చేస్తావు. నా రెండు లక్షల ఫాలోయర్స్‌ని లాగేసుకున్నావ్‌.. ఇప్పుడు నా అకౌంట్‌ని కూడా లాగేసుకోవద్దు. నా పట్ల క్రూరంగా ఉండవద్దని విన్నపం చేశాడు. ఇక తన కవితను వివరిస్తూ, పక్షీ,.. ఓ పక్షీ ఎక్కడుంది నీ ఇల్లు...?తుర్రు తుర్రుమంటూ ఇక్కడికి ఎగిరివస్తున్నావు. నిన్ను చూడాలనుకునే వారు ఇంత మంది....నీకెందుకు భయం..? ఒకవేళ అలిగితే చెప్పు మాకు. మేం తిరిగిపోతాం కాసేపు అటువైపు. సదా నీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి మాపై. నిత్యనూతనమైన మా పలుకులు కురిపిస్తాం నీపై.. అంటూ తన కవితను పోస్ట్‌ చేశాడు. 

Amitabh Bachchan dedicates a poem to Twitter:

Amitabh Bachchan takes to Twitter to write a poem on losing 200,000

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement