Advertisement

జనసేనలోకి ఎంట్రీ ఇవ్వనంటున్న హీరో!

Fri 23rd Feb 2018 11:17 PM
  జనసేనలోకి ఎంట్రీ ఇవ్వనంటున్న హీరో!
Srikanth opens up about his political entry జనసేనలోకి ఎంట్రీ ఇవ్వనంటున్న హీరో!
Advertisement

హీరో శ్రీకాంత్‌ చిన్న చిన్న పాత్రలు, విలన్‌ వేషాలు, మెయిన్‌ విలన్‌కు కొడుకుగా యంగ్‌ విలన్‌ పాత్రలు, సపోర్టింగ్‌ రోల్స్‌ చేస్తూ సొంత ప్రతిభతో హీరో అయ్యాడు. ముఖ్యంగా మీడియం బడ్జెట్‌ చిత్రాల మినిమమ్‌ గ్యారంటీ హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్‌ని బాగానే ఆకట్టుకున్నాడు. కానీ గత కొంత కాలంగా ఆయన హడావుడి తగ్గింది. దాంతో ఇప్పుడు ఆయన ఏ పాత్ర అయినా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆల్‌రెడీ విలన్‌గా చేసినా సినిమా ఫ్లాప్‌ కావడంతో ఆయనకు ఆఫర్లు రావడం లేదు. ఇక ఆయన ఇప్పటికీ హీరోగా నటిస్తున్న చిత్రాలు విడుదలకు నోచుకోకుండా మూలన పడిపోతున్నాయి. సపోర్టింగ్‌ క్యారెక్టర్స్‌ని కూడా మొదలుపెట్టి 'గోవిందుడు అందరి వాడేలే' వంటి చిత్రాలలో నటిస్తున్నాడు. తన పెద్ద కుమారుడిని హీరోగా 'నిర్మలా కాన్వెంట్‌'తో పరిచయం చేస్తే అది ఆడలేదు. 

ఇక తన కుమార్తెను 'రుద్రమదేవి'లో నటింపజేశాడు. త్వరలో తన మరో కుమారుడు కూడా ప్రభుదేవా చిత్రం ద్వారా పరిచయం కాబోతున్నాడు. ఇక మెగా హీరోలకు శ్రీకాంత్‌కి మధ్య మంచి అనుబంధం ఉంది. చిరంజీవి నటించిన పలు చిత్రాలలో చిన్నా చితకా పాత్రలు చేసిన ఆయన చిరుతో కలిసి 'శంకర్‌దాదా ఎంబిబిఎస్‌, శంకర్‌దాదా జిందాబాద్‌'లలో నటించాడు. ఇక ఈయనకు పవన్‌తో కూడా మంచి అనుబంధం ఉంది. తాజాగా మీడియా పవన్‌ స్థాపించిన 'జనసేన' పార్టీలో చేరుతారా? అని ప్రశ్నిస్తే నా జీవితంలో నేనెప్పుడు జనసేనే కాదు.. ఏ పార్టీలో కూడా చేరే పనిలేదు. రాజకీయాలంటే నాకు ఆసక్తి లేదు. అవి నాఒంటికి సరిపడవు... అని చెప్పాడు. ఇక పవన్‌ వచ్చే ఎన్నికల్లో నేరుగా పోటీ చేస్తానని చెప్పడంతో ఆయన సీట్టిచ్చే వారిలో కొందరు సినీ ప్రముఖులు కూడా ఉండే అవకాశం ఉంది. 

ఇక ఇప్పటికే పోసాని జనసేనకి మద్దతు ఇవ్వను. ఆయనకు ఓటు వేయనని చెప్పాడు. మొత్తానికి ఎన్టీఆర్‌ తర్వాత రాజకీయాలలోకి వచ్చిన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తరపున పలువురు టిక్కెట్లు ఆశించారు. కానీ గెలవలేకపోయారు. దాంతో పవన్‌ 'జనసేన'లో చేరే విషయంలో మన నటీనటులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. శ్రీకాంత్‌ మాత్రం తాను నటిస్తూ, మరోవైపు తన కుమారులు, కుమార్తెలను ఇండస్ట్రీకి పరిచయం చేసి, శ్రీమిత్ర చౌదరితో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారంపైనే దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. మరి ఈయన జనసేనకి ప్రచారమైనా చేస్తాడా? లేదా? అనేది చూడాలి.

Srikanth opens up about his political entry:

Hero Srikanth About Politics at raa raa press meet

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement