Advertisement

శివాజీపై దాడి.. అదే పవన్‌పై జరిగి ఉంటే?

Fri 23rd Feb 2018 05:14 PM
hero sivaji,bjp leaders,attack,slogans  శివాజీపై దాడి.. అదే పవన్‌పై జరిగి ఉంటే?
BJP workers attack Hero Sivaji శివాజీపై దాడి.. అదే పవన్‌పై జరిగి ఉంటే?
Advertisement

నాటి బిజెపి ఇప్పుడు ఉన్న బిజెపి వేరు వేరు అని అందరు ఒప్పుకుంటున్నారు. ఒకప్పటి వాజ్‌పేయ్‌, అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి వంటి వారు కూడా ఈ పరిస్థితిని చూసి ఆవేదన చెందుతూ, మౌనంగా ఉంటున్నారు. ఇక బిజెపి మీద ఎవరైనా విమర్శలు చేస్తే తమిళనాడు తరహాలో ఐటి దాడులు, ఇతర దాడులతో బెంబేలెత్తిస్తున్నారు. నాటి ఇందిరా ఎమర్జెన్సీ రోజులను ఇవి తలపిస్తున్నాయి. మోదీ తానో నియంతగా మారుతున్నాడు. పూర్తి మెజార్టీ బిజెపికి రావడం, ఇతరుల మద్దతు అవసరం లేకపోవడంతో బిజెపి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తోంది. బ్యాంకులను వేల కోట్లు ముంచిన వారిపై కనీసం స్పందించడం కూడా లేదు. అదే సామాన్యుడు పదివేలు కట్టకపోయినా బ్యాంకులు ఎలా ప్రవర్తిస్తాయో అందరికీ తెలుసు. స్విస్‌ నల్ల కుబేరులను బయటపెడతామన్నారు. అది చేయలేదు.

ఇక నోట్ల రద్దు వెనుక కూడా భారీ మనీ లాండరింగ్‌ ఉందని, మమతా బెనర్జీ వంటి వారు ఆరోపిస్తున్నారు. ఇవ్వన్నీ నిజమేనని అనిపిస్తోంది. అంబానీలకు, ఆదానీలకు కొమ్ముకాస్తూ పేద, మద్యతరగతిని నాశనం చేస్తున్నారు. ఇక ఏపీ విషయంలో వారు చేస్తున్న చేష్టలు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. ఇక నాడు బిజెపిలో ఉండి, ఇప్పుడు ప్రత్యేకహోదాపై తీవ్రంగా బిజెపిని టార్గెట్‌ చేసిన హీరో శివాజీపై బిజెపి మూకలు దాడి చేయడం ఆశ్చేపనీయం. కిందటి ఎన్నికల్లో బిజెపికి ఓటు వేయమని తాను ఇల్లిళ్లు అడుక్కుతిన్నానని, మోదీ పెద్ద జీరో అని, ఏపీ ప్రజలకు ఇంకా సహనం ఉంది కాబట్టి బిజెపి నాయకులు ఇంకా మాట్లాడగలుతున్నారని, ఇంకా మాట్లాడితే ప్రజలు తిప్పికొడతారని శివాజీ అన్నాడు. దాంతో బిజెపి మూకలు శివాజీ, కాంగ్రెస్‌ నాయకురాలు పద్మ మీద దాడి చేశాయి. ఇక తమదే నిజమైన ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ అని బిజెపి ప్రకటించడం చూస్తే నవ్వు కలుగుతోంది. 

ఒకవైపు కాంగ్రెస్‌, మరోవైపు బిజెపి మోసం చేసిన నేపథ్యంలో కేంద్రంలో వచ్చేసారి వామపక్షాలతో కూడిన తృతీయ ఫ్రంట్‌కి మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. ఇక శివాజీ మీద దాడి చేసినట్లే బిజెపిని విమర్శిస్తే పవన్‌ మీద కూడా ఇలాగే దాడులు చేసే దమ్ము బిజెపి వారికి ఉందా? శివాజీకైతే పెద్దగా అభిమానులు, వెనుక పెద్ద తలకాయలులేవు. అదే పవన్‌ మీద దాడి జరిగితే ఏపీ భగ్గుమని అందులో బిజెపి దహనం కావడం ఖాయమనే చెప్పవచ్చు. నేతి బీరకాయలో నేయి చందంగా ప్రజాస్వామ్యం గురించి బిజెపి నేతలు మాట్లాడటం హాస్యాస్పదం.

BJP workers attack Hero Sivaji:

BJP leaders tried to attack Hero Sivaji and raised slogans on him

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement