భాగమతి అశోక్‌కి పిలుపొచ్చింది!

'పిల్లజమీందార్‌' చిత్రంతో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు జి.అశోక్‌. ఈ చిత్రం తప్ప ఆయన దర్శకత్వం వహించిన 'సుకుమారుడు' నుంచి ఏ చిత్రం కూడా ఆడలేదు. ఇక ఈయన చాలా కాలం కిందట విక్టరీ వెంకటేష్‌ నటించే ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడని, ఇది కూడా మూకీ చిత్రమనే ప్రచారం జరిగింది. కథను పూర్తిగా తయారు చేసి, స్క్రిప్ట్‌తో సురేష్‌ ప్రోడక్షన్స్‌ వెంట ఎంత తిరిగినా ఈ చిత్రం పట్టాలెక్కలేదు. దాంతో అశోక్‌ యువి క్రియేషన్స్‌ పుణ్యామా అని 'భాగమతి' చిత్రం తీసి తన సత్తా చాటాడు. కథ, కథనాలు గొప్పగా లేకపోయినా ఈ చిత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. దాంతో ఆయనకు తాజాగా సురేష్‌ ప్రోడక్షన్స్‌ సంస్థ నుంచి పిలుపు వచ్చిందని సమాచారం. 

ప్రస్తుతం వెంకటేష్‌ సురేష్‌ ప్రోడక్షన్స్‌-ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌లో తేజ దర్శకత్వంలో 'ఆటా నాదే వేటా నాదే' అనే చిత్రం చేయనున్నాడు దీని తర్వాత వరుణ్‌తేజ్‌తో కలిసి మల్టీస్టారర్‌గా దిల్‌రాజు నిర్మాతగా, హ్యాట్రిక్‌ చిత్రాల దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్‌ 2' ( ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌) చేయనున్నాడు. మరి అశోక్‌ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కనుందో తెలియరావడం లేదు. మరి అశోక్‌ ఇంతకు ముందు చెప్పిన మూకీ చిత్రం కథతోనే ఈ చిత్రం ఉంటుందా? లేక కొత్త సబ్జెక్ట్‌తో ఉంటుందా అనేది తెలియాల్సివుంది...! మొత్తానికి 'గురు' తర్వాత ఎంతో గ్యాప్‌ తీసుకున్న వెంకటేష్‌ వరుస చిత్రాలను లైన్‌లో పెడుతున్నాడనే చెప్పాలి.

Ashok directs Victory Venkatesh for his next

Bhagamathie Ashok Next Movie Update
ashok
director
bhagamathie
victory venkatesh
next movie