Advertisement

మహేష్‌ హీరోయిన్‌ సూక్తులు చెబుతోంది!

Tue 13th Feb 2018 04:39 PM
kriti sanon,mahesh heroine,next movie,arjun patiala  మహేష్‌ హీరోయిన్‌ సూక్తులు చెబుతోంది!
Mahesh Heroines Starts Her Movie Promotion మహేష్‌ హీరోయిన్‌ సూక్తులు చెబుతోంది!
Advertisement

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు హీరోగా అందునా క్రియేటివ్‌ జీనియస్‌ సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన '1' (నేనొక్కడినే) చిత్రంలో కొత్తమ్మాయి కృతిసనన్‌ ఎంపికైందని తెలియగానే ప్రతి ఒక్కరు ఎవరా లక్కీ గర్ల్‌ అంటూ తమ చూపునంతా ఆమెపై కేంద్రీకరించారు. ఈ చిత్రం హిట్టయితే ఇక ఈమెకి వరుసగా స్టార్స్‌తో అవకాశాలు, స్టార్‌ హీరోయిన్‌ కావడం ఖాయమని భావించారు. అందునా ఆ చిత్రం పోస్టర్స్‌తో కూడా ఆమె బాగా ఆకట్టుకుంది. కానీ సినిమా సరిగా ఆడకపోయే సరికి పాపం తన బాధ్యత లేకపోయినా పరాజయ భారాన్ని మాత్రం ఆమే మోయాల్సి వచ్చింది. దర్శకుడుగా సుకుమార్‌కి అవకాశాలేమీ తగ్గలేదు. మహేష్‌ స్టామినా ఏమీ పడిపోలేదు. కానీ ఫలితం మాత్రం కృతిసనన్‌ భరించింది. ఆ తర్వాత నాగచైతన్యతో కలిసి 'దోచెయ్‌' చిత్రం చేస్తే అది కూడా ఫ్లాప్‌ అయింది. అయినా ఆమెకి పూజా హెగ్డేలాగా అదృష్టం కలిసి రాలేదు. ఆ తర్వాత ఆమె బాలీవుడ్‌కి వెళ్లి ఏవో ఒకటి అరా కొరా చిత్రాలలో నటిస్తోంది. 

ఇక ఈమె తాజాగా మాట్లాడుతు పలు జీవిత సూక్తులు చెబుతోంది. లైఫ్‌లో ఫెయిల్యూర్స్‌ వచ్చినప్పుడే సక్సెస్‌ విలువ తెలుస్తుంది. ఫెయిల్యూర్స్‌ నుంచే కాదు సక్సెస్‌ల నుంచి కూడా మనం ఏదైనా నేర్చుకుంటేనే లైఫ్‌ ఇంకా మెరుగవుతుంది. లైఫ్‌లో ఎత్తు పల్లాలు ఉంటాయి. కష్టానికి భయపడకూడదు. విజయానికి పొంగిపోకూడదు. పరిస్థితులకు తగ్గట్లు ముందుకు సాగాలి. నాకు టీం నచ్చితేనో, నా క్యారెక్టర్‌ నచ్చితేనో మాత్రమే సినిమాలలో నటించేందుకు ఒప్పుకుంటాను. లేకపోతే లేదని చెప్పేస్తాను. ఎవరికైనా లైఫ్‌లో సక్సెస్‌ ఫెయిల్యూర్స్‌ కామనే. కాకపోతే లైఫ్‌ జర్నీలో ఏమి నేర్చుకున్నామనేదే ముఖ్యం. మిమ్మల్ని బాధపెట్టేవారు, వెనక్కి లాగే వారు మన వెంటే ఉంటారు. 

మన ఆనందాన్ని లాక్కోవడమే వారి పని, వారి గురించి ఆలోచించవద్దు. అలాంటి వారికి ప్రాధాన్యం ఇవ్వవద్దు. ఇండస్ట్రీలో మానసికంగా బలంగా ఉండటం ముఖ్యమని నేను తెలుసుకున్నాను. ముందుగా మన మీద మనకి నమ్మకం ఉండాలి. ఎన్నోమంచి ఉద్యోగాలు వదులుకుని మోడల్‌గా వచ్చి, కమర్షియల్స్‌ చేశాను. నాపై నాకున్న నమ్మకంతోనే నటనవైపు అడుగులు వేశాను. మనం ఎంత కష్టాన్ని అందించగలమో అందిస్తే అంత కన్నా ఎక్కువ ఫలితాన్ని పొందుతాం' అని చెప్పుకొచ్చింది. ఈమె ప్రస్తుతం రోహిత్‌ జుగరాజ్‌ దర్శకత్వంలో దిల్జీత్‌ హీరోగా నటిస్తున్న 'అర్జున్‌ పాటియాలా' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.

Mahesh Heroines Starts Her Movie Promotion:

Kriti Sanon gets into prep mode for Arjun Patiala

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement