అఖిల్ ఏదో చెబుతా అన్నావ్.. ఏమైంది?

Akhil in Silent Mode

Sat 10th Feb 2018 09:39 PM
akhil,next movie,silent mode,hello,no clarity  అఖిల్ ఏదో చెబుతా అన్నావ్.. ఏమైంది?
Akhil in Silent Mode అఖిల్ ఏదో చెబుతా అన్నావ్.. ఏమైంది?
Advertisement

'అఖిల్' సినిమా తర్వాత అఖిల్ హలో సినిమా చెయ్యడానికి బోలెడంత టైం తీసుకున్నాడు. ఆ టైం లో అఖిల్ ఆ దర్శకుడి దర్శకత్వంలో నటిస్తున్నాడు ... ఈ దర్శకుడి దర్శకత్వంలో నటిస్తున్నాడు అంటూ అనేక పుకార్లు షికార్లు చేశాయి. చివరికి విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'హలో' తో యావరేజ్ హిట్ కొట్టాడు అఖిల్. మళ్ళీ హలో సినిమా తర్వాత వెంటనే తన మూడో సినిమా మొదలెడతాడు అనుకుంటే... మళ్లీ అఖిల్ చాలా సమయం తీసుకునేలా  కనబడుతున్నాడు. ఎందుకంటే జనవరి 10  నే తన మూడో సినిమా దర్శకుడితో పాటు అన్ని డీటెయిల్స్ ఇస్తానని చెప్పిన అఖిల్ ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నాడు.

ఈ లోపు అఖిల్ సుకుమార్ తోనూ, కొరటాలతోను, సత్యపినిశెట్టి వంటి దర్శకులతోను సినిమాలు చేస్తాడంటూ సోషల్ మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. కానీ వారిలో ఏ దర్శకునితో అఖిల్ సినిమాలు చెయ్యడంలేదు గాని... ఒక పెద్ద దర్శకుడితో మాత్రం సినిమా చెయ్యబోతున్నాడనేది సమాచారం. కాకపోతే ఆ దర్శకుడి పేరు మాత్రం బయటికి రావడంలేదు గాని... ఆ సినిమాని మాత్రం హీరో రానా నిర్మిస్తాడని మాత్రం క్లారిటీ ఉంది. కేవలం ఆ సినిమా మాత్రమే కాదు... అఖిల్ తో మరో సినిమాని నిర్మించే ప్లాన్ లో కూడా రానా ఉన్నాడంటున్నారు.

ఇకపోతే నాగార్జున ప్రస్తుతానికి అఖిల్ విషయం పక్కనెట్టి తాను రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నటించబోయే సినిమా సెకండ్ షెడ్యూల్ లో ముంబాయి లో బిజీగా వున్నాడు. మరి అఖిల్ కోసం మంచి కథని తీసుకుని ఎవరైనా పెద్ద దర్శకుడు వస్తే నాగ్ తన పని పక్కనెట్టి అఖిల్ మూడో సినిమా కథ చర్చల్లో పాల్గొంటాడని తెలుస్తుంది.

Akhil in Silent Mode:

Akhil Silent On about His Next Movie After Hello


Loading..
Loading..
Loading..
advertisement