సిల్క్‌స్మిత ఇగో గురించి చెప్పేశాడు!

Wed 07th Feb 2018 12:41 AM
shiva shankar master,silk smitha,ego,shiva shankar master,revealed  సిల్క్‌స్మిత ఇగో గురించి చెప్పేశాడు!
Siva Shankar Master Reveled about Silk Behavior సిల్క్‌స్మిత ఇగో గురించి చెప్పేశాడు!

దక్షిణాదిన ఉన్న సీనియర్‌ అండ్‌ మోస్ట్‌ టాలెంటెడ్‌ కొరియోగ్రాఫర్లలో శివశంకర్‌ మాస్టార్‌ ఒకరు. ఈయన నాడు సలీం మాష్టర్‌ దగ్గర అసిస్టెంట్‌గా ఉండేవాడు. నాడే నాటి శృంగార తార సిల్క్‌స్మిత హవా ఓ రేంజ్‌లో ఉండేది. ఇక శివశంకర్‌ మాస్టార్‌ అటు హీరోయిన్లకు, ఇటు హీరోలకు కూడా తానే స్టెప్స్‌ కంపోజ్‌ చేసినందువల్ల ఆయన హావభావాలు, నడక వంటి వాటిలో మహిళా ఛాయలు కూడా కనిపిస్తాయి. మన తెలుగు సినీ దర్శకులు ఎలాంటి వారంటే ఇంత గొప్ప శివశంకర్‌ మాస్టార్‌లోని ఆ ఆడతనాన్ని ఇమిటేట్‌ చేస్తూ టీవీ చానెల్స్‌లో స్కిట్స్‌, సినిమాలలో కామెడీ ట్రాక్‌లు నడిపారు. 

ఇక విషయానికి వస్తే తాజాగా శివశంకర్‌ మాస్టార్‌ తనకు సిల్క్‌స్మితకు మధ్య వచ్చిన స్పర్ధల గురించి మాట్లాడుతూ, ఆమె విషయంలో తనకు గొడవైందని చెప్పుకొచ్చాడు. అయితే సిల్క్‌స్మిత ఎంతో అందమైన ఆర్టిస్ట్‌. ఆమెను అభిమానించే వారిలో నేనుకూడా ఒకరిని, బాలీవుడ్‌లో రేఖ, దక్షిణాదిన సిల్క్‌స్మితల డ్యాన్స్‌లు అద్భుతంగా ఉండేవి. ఆమె ఫేమస్‌ అయిన తర్వాత తానే సొంతగా డ్యాన్స్‌ మాస్టర్స్‌ని తయారు చేసుకుంది. ముఖ్యంగా ఆమె ఎప్పుడు పులిగిరి సరోజని రికమెండ్‌ చేస్తూ ఉండేది. సరోజ గారి డేట్స్‌ దొరకనప్పుడు మా వంటి వారిని పెడితే సరిగా చేయకుండా నానాయాగీ చేసేది. బాలకృష్ణ నటించిన 'భలే తమ్ముడు' చిత్రంలో సిల్క్‌స్మిత పాటను పెట్టాం. స్టెప్స్‌ కూడా బాగా వచ్చాయి. కానీ నేను ఆ పాటను కంపోజ్‌ చేయడం ఇష్టంలేని ఆమె అడ్వాన్స్‌ని తిరిగి ఇచ్చేసి సినిమా చేయకుండా వెళ్లిపోయింది. దాంతో ఆ పాటను, స్టెప్స్‌ని ఎలాగైనా సినిమాలో ఉంచాలని భావించిన నిర్మాత అర్జున్‌రాజు కోరిక మేరకు ఆపాటకు జయమాలినిని తీసుకున్నాం. ఇక సిల్క్‌స్మిత నాకు సలీం మాస్టార్‌ దగ్గర నేను అసిస్టెంట్‌గా ఉన్నప్పటి నుంచి తెలుసు. బహుశా నాలాంటి చిన్నవారితో చేయడం ఆమెకి నామోషీ అనిపించి అలా బిహేవ్‌ చేసేదని అనుకుంటాను అని చెప్పుకొచ్చాడు. నాటి శృంగార తారలోని ఇగో ప్రాబ్లమ్‌ ఇంత కాలానికి శివశంకర్‌ మాస్టార్‌ వల్ల బయటికి వచ్చింది.

Siva Shankar Master Reveled about Silk Behavior:

Shiva Shankar Master About Clashes With Silk Smitha