ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Fahad Fazil walks out of Mani Ratnam's next film

మణిరత్నం సినిమా నుండి ఆ నటుడు అవుట్!

Fahad Fazil  walks out of Mani Ratnam's next filmFahad Fazil walks out of Mani Ratnam's next film

'చెలియా' సినిమా డిజాస్టర్ తో దర్శకుడు మణిరత్నం మళ్ళీ మరో సినిమాని తెరకెక్కించడానికి భారీ గ్యాప్ తీసుకున్నాడు. ఈ గ్యాప్ లో ఒక భారీ మల్టి స్టారర్ కోసం పక్కా స్క్రిప్ట్ ని రెడీ చేసుకున్నాడు. ఒక కొత్త కథతో భారీగా ఈ మల్టీస్టారర్ ని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు మణి. ఈ సినిమా అతి త్వరలోనే అంటే వచ్చే నెలలోనే సెట్స్ మీదకెళ్లనుందని చెబుతున్నారు. అయితే ఈ భారీ మల్టీస్టారర్ కోసం భారీగా స్టార్ కాస్ట్ ని కూడా ఫైనల్ చేసాడు ఈ దర్శకుడు. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలకు గాను కోలీవుడ్ హీరోస్ కార్తీ, శింబు, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, జ్యోతిక, ఐశ్వర్య రాజేశ్, అదితీరావులను ఎంపిక చేశారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా నుండి ఆ భారీ స్టార్ కాస్ట్ లోని ఒక నటుడు తప్పుకుంటున్నట్లుగా చెబుతున్నారు. మరి ఇంతకుముందే శింబు ఈ సినిమాలో చేస్తాడో లేదో అన్నట్లుగా కోలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఎందుకంటే శింబు మీద నిర్మాతల మండలి నిషేధం విధించిందని ప్రచారం జరిగింది. ప్రస్తుతానికి ఆ విషయమై ఎటువంటి క్లారిటీ లేదుగాని... ఇప్పుడు ఈ మణి మల్టీస్టారర్ నుండి ఫహాద్ ఫాజిల్ అనే నటుడు తప్పుకున్నట్లుగా  కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.

అయితే ఫహాద్ ఫాజిల్ కేవలం డేట్స్ సర్దుబాటు కాలేకే ఈ మల్టీస్టారర్ నుండి తప్పుకున్నాడని అంటున్నారు. మరి ఫహాద్ ఫాజిల్ స్థానంలోకి మరో కొత్త నటుడుని సెట్ చేసుకుని ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లాలని మణి భావిస్తున్నాడట. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ సినిమాకి సంగీత దిగ్గజం ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు.

Malayalam actor Fahad Fazil Out From Mani Ratnam Film

fahad fazil
maniratnam
out
malayalam actor