చరణ్ యాక్టింగ్ కి సుక్కు రియాక్షన్!

Fri 02nd Feb 2018 12:15 AM
ram charan,rangasthalam,sukumar,feels,emotional,ram charan,acting  చరణ్ యాక్టింగ్ కి సుక్కు రియాక్షన్!
Sukumar Emotional with Charan Performance చరణ్ యాక్టింగ్ కి సుక్కు రియాక్షన్!
Sponsored links

తను రాసుకున్న సీన్ ని నటుడు సరిగా చేస్తే డైరెక్టర్ కన్నా సంతోష పడేవారు మరొకరు ఉండడు. కానీ కొన్ని కొన్ని సార్లు స్టార్ హీరో విషయంలో డైరెక్టర్ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. కోలీవుడ్ లో అయితే డైరెక్టర్ అనుకున్న సీన్ సరిగా వచ్చేవరకు ఆ నటుడు నటించే వరకు వదలరు. అందుకే కోలీవుడ్ లో మంచి నటులు వున్నారంటారు. అలానే మన టాలీవుడ్ లో కూడా... అలాంటి నటులు చాలానే వున్నారు.

సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ 'రంగస్థలం' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం సుకుమార్.. చరణ్ మేకోవర్ ని పూర్తిగా మార్చేశాడు. కొన్ని కొన్ని సీన్స్ లో చరణ్ ని సుక్కు బాగా వాడుకున్నాడట. చరణ్ కూడా సుక్కు అనుకున్నట్టు బాగా నటించాడట. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు ఎండింగ్ కి వచ్చేసింది. అయితే రీసెంట్ గా సుక్కు ఫైనల్ రష్ ని చూసి ఒక్కసారిగా చరణ్ ని గట్టిగా పట్టుకుని కంటతడి పెటుకున్నాడట. ఇది చూసిన చిత్ర యూనిట్ మొత్తం షాక్ అయ్యారట.

సుకుమార్ తన లైఫ్ లో ఎప్పుడు ఇంతలా ఎమోషనల్ అవ్వలేదని ఇదే మొదటిసారని చిత్ర యూనిట్ చెబుతుంది. మరి తీసిన డైరెక్టర్ కే అలా ఉంటే బిగ్ స్క్రీన్ లో చూసే కామన్ ఆడియెన్ కు ఎలా ఉంటుంది అని చరణ్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మన టాలీవుడ్ లో కరెక్ట్ గా చేయించుకుంటే చేసే నటులు చాలానే వున్నారు. కానీ వారిని సరిగా వాడుకోవట్లా అంతే. ఇక రంగస్థలం సినిమా మార్చి 30 న మన ముందుకు రానుంది.

Sponsored links

Sukumar Emotional with Charan Performance:

Sukumar Gets Emotional With Ram Charan Acting in rangasthalam    

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019