కొరటాల శివ - మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'భరత్ అనే నేను' షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమా విడుదల ఏప్రిల్ లోనే ఉండడంతో సినిమా షూటింగ్ ని పరిగెత్తిస్తున్నారు. అయితే 'భరత్ అనే నేను' సినిమా క్లైమాక్స్ కొత్తగా ఉండబోతుందనే టాక్ వినబడుతుంది. ఈ సినిమా క్లైమాక్స్ భారీగా, హైలైట్ గా చేయబోతున్నారట. మాములుగా కొరటాల సినిమాల్లో ప్రీ క్లైమాక్స్ నుండి గ్రాఫ్ పూర్తిగా మారిపోతుంది.
దానికి సంబందించిన సీన్లు సింపుల్ గా ఉంటాయేమో కాని.. అందులోని భావం మాత్రం పవర్ ఫుల్ గా ఉంటుంది. మరి మహేష్ తో తీస్తున్న 'భరత్ అను నేను' కోసం కూడా అలాంటి క్లైమాక్స్ నే కొరటాల చూపిస్తాడు అనుకుంటే.. ఈసారి మాత్రం కొత్తగా కొంగొత్తగా... హైదరాబాద్‌లో భారీ సెట్ మధ్య మహేష్ బాబుతో క్లైమాక్స్ సీన్స్ ని షూట్ చేయబోతున్నాడట. ఈ క్లైమాక్స్ సీన్స్ కోసం వందల మంది జూనియర్ ఆర్టిస్టులను కూడా తెప్పిస్తున్నారట. ఆ జూనియర్ ఆర్టిస్టుల మధ్య ఓ భారీ యాక్షన్ సీన్ కూడా ఉండబోతుందని, ఇక ఈ యాక్షన్ సీన్‌ను అన్నదమ్ములు రామ్, లక్ష్మణ్ ఆధ్వర్యంలో చిత్రకరించబోతున్నట్లుగా కూడా చెబుతున్నారు.
ఈ క్లైమాక్స్ షూట్ ఫినిష్ అయితే సినిమా షూటింగ్ కూడా ఒక కొలిక్కి వచ్చేస్తుందని చెబుతున్నారు. షూటింగ్ పూర్తి కాగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేపట్టి... సినిమాను వీలైనంత త్వరగా విడుదల చేసేయాలని కొరటాల, మహేష్, నిర్మాత డి వి వి దానయ్యలు సన్నాహాలు చేస్తున్నారు. మహేష్ బాబుకి జోడీగా బాలీవుడ్ భామ కైరా అద్వానీ ఈ సినిమాలో నటిస్తుంది.