Advertisement

మోహన్‌బాబుకి ఈసారి తిరుగులేదు..!

Tue 30th Jan 2018 07:49 PM
gayatri,gayatri movie trailer,mohan babu,good response,anasuya,dialogues  మోహన్‌బాబుకి ఈసారి తిరుగులేదు..!
Good Response to Mohan Babu Gayatri Trailer మోహన్‌బాబుకి ఈసారి తిరుగులేదు..!
Advertisement

మంచి పంచ్‌ డైలాగులు ఉంటే మోహన్‌బాబు వాటికి ఎంతగా జీవంపోస్తాడు..? ఏ స్థాయిలోమెప్పిస్తాడు? అనేది తెలిసిందే. కాగా మోహన్‌బాబు ఇటీవల తాను 'అసెంబ్లీ రౌడీ' తర్వాత ఆస్థాయి పొలిటికల్‌ మూవీగా 'గాయత్రి'లో నటిస్తున్నానని చెప్పినప్పటి నుంచి ఈ చిత్రంపై ఓ రకమైన పాజిటివ్‌ బజ్‌ ఇండస్ట్రీలో ఏర్పడింది. అందునా నేడు ఎన్నికల సెగ రాజుకుంటోంది. వస్తున్న పొలిటికల్‌ టచ్‌ మూవీస్‌ కూడా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొంటున్నాయి. ఈ నేపధ్యంలో పొలిటికల్‌ సెటైరిక్‌ ఫిల్మ్స్‌ ట్రెండ్‌ నడుస్తున్న సమయంలో మోహన్‌బాబు 'గాయత్రి'గా ఎలా కనిపించనున్నాడు? అనే విషయంలో కాస్త క్లూ లభించింది. 

తాజాగా విడుదలైన ఆడియో వేడుకలో ట్రైలర్‌ని కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి మోహన్‌బాబు కుటుంబం, టి.సుబ్బరామిరెడ్డి, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, అనసూయ, శ్రియాశరణ్‌ వంటి వారు హాజరయ్యారు. ఈ చిత్రంలో కోటశ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, మంచు విష్ణు, శ్రీయాలతో పాటు పోసాని కృష్ణమురళి కూడా నటించాడు. ఇక ఈ ట్రైలర్‌ జడ్జి అయిన కోట శ్రీనివాసరావు వాయిస్‌ ఓవర్‌తో మొదలైంది. 'ఇంతైనా పశ్చాత్తాపం లేని ఈ ముద్దాయిని నేరస్దుడిగా పరిగణించి ఉరిశిక్ష విధించడమైనది' అనే డైలాగ్‌తో పాటు 'తమరంటే భయం నటిద్దామని ..' అనే డైలాగ్‌, జర్నలిస్ట్‌ అనసూయని ఉద్దేశించిమోహన్‌బాబు చెప్పే 'అది వదిలేరకం కాదు.. నేను దొరికే రకం కాదు..', 'రాజీపడాల్సిన చోట యుద్దం చేయకూడదు. నువ్వేం అనుకుంటే చెప్పడం నీ అలవాటు..నేనేం అనుకుంటే అది చేయడం నా అలవాటు, అక్షరాలు లేని స్వచ్చమైన భాష నవ్వు, దేవుడు చాలా మంచోడు. రాక్షసులకు కూడా వరాలిస్తాడు.. కత్తో కర్రో పట్టుకుంటే ఎవడైనా రౌడీ కావచ్చు.. ప్లాన్‌ యూ టర్న్‌ తీసుకుంది, ఓ ఆడదాని ఏడుపు వల్ల రామాయణం జరిగితే, ఓ ఆడదాని నవ్వు వల్ల భారతం జరిగింది..' వంటి డైలాగ్స్‌ బాగా ఆకట్టుకుంటున్నాయి. 

ఇక శివాజీ అనే పేరు కలిగిన మంచు విష్ణు క్యారెక్టర్‌, శ్రియ పాత్రలపై మంచి క్యూరియాసిటీ ఏర్పడుతోంది. 'గాయత్రి పటేట్‌ ప్రతి పేజీ క్రైమ్‌ పేజీరా' అనే డైలాగ్‌కూడా మంచి పట్టుగా ఉంది. ఇక ఈ చిత్రం సాయిధరమ్‌తేజ్‌ నటిస్తున్న వినాయక్‌ చిత్రం 'ఇంటెలిజెంట్‌', వరుణ్‌తేజ్‌ హీరోగా నటిస్తున్న 'తొలిప్రేమ' చిత్రాలతో పోటీ పడి విడుదల కానుంది. 'ఇంటెలిజెంట్‌' చిత్రం వినాయక్‌ స్టైల్‌లో రూపొందే ఇంటెలిజెంట్‌ మాఫియా స్టోరీగా, 'తొలిప్రేమ' క్యూట్‌ లవ్‌స్టోరీలుగా రూపొందుతుండగా, మోహన్‌బాబు 'గాయత్రి' చిత్రం పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌ చిత్రంగా రూపొందుతుండటం విశేషంగా చెప్పాలి. మరి ఈ మూడు చిత్రాలలో ఏది బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తుందో వేచిచూడాల్సి వుంది..! 

Click Here to See the Trailer

Good Response to Mohan Babu Gayatri Trailer:

Mohan Babu Dialogues Highlight in Gayatri Movie

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement