Advertisementt

1 మంత్ బేబీని ఇంట్రడ్యూస్ చేస్తున్న కమెడియన్!

Sun 28th Jan 2018 03:42 PM
actor,srinivas reddy,one month,old daughter,debuts,jamba lakidi pamba  1 మంత్ బేబీని ఇంట్రడ్యూస్ చేస్తున్న కమెడియన్!
Comedina Srinivas Reddy Daughter in JLP 1 మంత్ బేబీని ఇంట్రడ్యూస్ చేస్తున్న కమెడియన్!
Advertisement
Ads by CJ

కమెడియన్లుగా బిజీగా ఉండి కామెడీ పాత్రలు వదిలేసి హీరోలుగా మారిన సునీల్‌, సప్తగిరి వంటి వారు పడుతున్న అవస్థలు చూస్తూనే ఉన్నాం. దీంతో తెలుగులోకి జబర్దస్త్‌ షో కమెడియన్స్‌ రాక పెరిగిపోయింది. అయినా కూడా వెన్నెలకిషోర్‌, శ్రీనివాస రెడ్డిలు మాత్రం సినిమాలలో లీడ్‌ పాత్రలు పోషిస్తూనే కమెడియన్‌ వేషాలు కూడా వదలకుండా తమ లౌక్యం చూపిస్తున్నారు. 

ఇక కమెడియన్‌గా శ్రీనివాసరెడ్డి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అద్భుతమైన కామెడీ టైమింగ్‌ ఉన్న హాస్యనటుల్లో ఆయనది మొదటి స్థానం అనే చెప్పాలి. ఇక 'గీతాంజలి, జయమ్ము నిశ్చయంబురా, ఆనందోబ్రహ్మ' వంటి చిత్రాలలో కీలక పాత్రలే కాకుండా కమెడియన్‌గా కూడా బిజీగా ఉన్నాడు. ఇక ఈయన ప్రస్తుతం జె.బి.వంశీకృష్ణ దర్శకత్వంలో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్‌ చిత్రం 'జంబలకిడి పంబ' చిత్రంలో ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు. ఇక ఈయన రవితేజ నటించిన 'రాజా ది గ్రేట్‌' చిత్రం షూటింగ్‌ సమయంలో తాను రెండోసారి తండ్రిని కాబోతున్నాను అనే తీపి కబురు అందుకున్నాడు. 

ఇక ఆయనకు పాప పుట్టింది. ఈ పాపకి ఇంకా నామకరణం చేసి పేరు కూడా పెట్టలేదు. పసిపాప పుట్టి కేవలం నెలరోజులే. కాగా ఈ పాప 'జయంబు నిశ్చయంబురా' చిత్రంలో తన 30రోజుల వయసులోనే 'జంబలకిడి పంబ'లో కెమరా ముందుకు వచ్చి సినిమాలో కనిపించనుండటంతో ఆయన ఎంతో హ్యాపీగా ఉన్నాడు. 

Comedina Srinivas Reddy Daughter in JLP:

Actor Srinivas Reddy's one month old daughter debuts in Jamba Lakidi Pamba

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ