Advertisementt

రవితేజని డామినేట్ చేస్తానంటున్న భామ!

Sun 28th Jan 2018 01:56 AM
seerat kapoor,raviteja,dominated,touch chesi choodu,movie  రవితేజని డామినేట్ చేస్తానంటున్న భామ!
Heroine Orders Raviteja రవితేజని డామినేట్ చేస్తానంటున్న భామ!
Advertisement
Ads by CJ

'రన్‌రాజారన్‌' చిత్రం ద్వారా టాలీవుడ్‌కి పరిచయమైన భామ సీరత్‌కపూర్‌, తర్వాత ఈమె 'కొలంబస్‌, రాజుగారి గది2, ఒక్క క్షణం' ఇప్పుడు రవితేజ హీరోగా చేస్తున్న 'టచ్‌చేసి చూడు'లో కూడా సెకండ్‌ హీరోయిన్‌గా రాశిఖన్నాతో కలిసి నటిస్తోంది. మంచి పాత్రలు వచ్చినప్పుడు ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు కదా అని సినిమాలని వదిలేసుకోలేం. 'టచ్‌చేసిచూడు'లో ఓ మాస్‌ సాంగ్‌ ఉంది. అది కూడా నాపైనే ఉంటుంది. ఇక రవితేజ అందరినీ టీజ్‌ చేయడం రొటీన్‌ అయిపోయింది. దాంతో ఈ చిత్రంలో నేను రవితేజకి డామినేట్‌ చేసే పాత్రను చేస్తున్నారు. రవితేజ చిత్రాలంటేనే మాస్‌కి ఫుల్‌ మీల్స్‌లా ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటాయి. 

ఇక ఇందులో రవితేజ పోలీస్‌ కూడా కావడంతో ఈ చిత్రం డబుల్‌ పవర్‌ఫుల్‌గా ఉంటుంది. 'ఒక్క క్షణం' చిత్రంలో నాది హీరోయిన్‌ పాత్ర కాకపోయినా నాకు ఎంతో పేరు తెచ్చే పాత్ర కాబట్టే విఐ ఆనంద్‌ గారు అడిగిన వెంటనే ఓకే చెప్పాను, అనుకున్నట్లే ఆ పాత్రకి మంచిపేరు వచ్చింది. ఇక ప్రస్తుతం రానా హీరోగా సురేష్‌ ప్రొడక్షన్స్‌ బేనర్‌లో రూపొందే చిత్రం, 'క్షణం' దర్శకుడు రవికాంత్‌ పేరేపు దర్శకత్వంలో గుంటూరు టాకీస్‌ బేనర్‌లో రూపొందే చిత్రాలలో నటిస్తున్నాను. ఇక చిత్ర కథ, అందులో నా పాత్ర ఎలా ఉంటుంది? అనే వాటి మీద ఆధారపడే సినిమాలు ఒప్పుకుంటాను. అలాగని గ్లామర్‌ పాత్రలు చేయను అని కాదు. అవి చేస్తూనే హీరోయిన్‌కి ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తాను. 'టచ్‌ చేసి చూడు' చిత్రం ఖచ్చితంగా పెద్ద హిట్‌ కావడమే కాదు.. నా పాత్రకి మంచి పేరును తెచ్చిపెడుతుంది అని చెప్పుకొచ్చింది. 

Heroine Orders Raviteja:

Seerat Kapoor Dominated Raviteja

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ