Advertisement

'అజ్ఞాతవాసి' యూఎస్ రికార్డు..!

Mon 08th Jan 2018 12:06 AM
agnathavasi,movie,sensation,usa record  'అజ్ఞాతవాసి' యూఎస్ రికార్డు..!
Agnathavasi Movie USA Record 'అజ్ఞాతవాసి' యూఎస్ రికార్డు..!
Advertisement

'అజ్ఞాతవాసి' సినిమా విడుదల దగ్గర పడుతున్న కొద్దీ సినిమాపై భారీ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్ కి కలెక్షన్స్ పరంగా.. రికార్డ్స్ పరంగా దూసుకుపోయే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రం అప్పుడే ధమాకా మొదలుపెట్టేసింది.

యూఎస్ లో ఈ చిత్రాన్ని ఇండియన్ హిస్టరీ లోనే ఎవరు రిలీజ్ చేయని విధంగా 580 లొకేషన్స్ లో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే చాలా లొకేషన్స్ లో ఓపెన్ చేయగా...అందులో 415 లొకేషన్స్ లో టికెట్స్ ఇప్పటికే బుక్ అయిపోయాయని... తద్వారా $5,13000 నమోదైనట్లు అక్కడ ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇలా బుక్ అవ్వడం ఇదే తొలిసారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు.

'అజ్ఞాతవాసి' యూఎస్ లో ఈనెల 9 వ తేదీన విడుదల కానుంది. అంటే మూడు రోజులు ముందే దీని ప్రభంజనం మొదలైపోయింది. దీనిబట్టి..ఈ చిత్రంపై ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. రిలీజ్ దగ్గర పడేకొద్దీ ఈ ఫిగర్ ఇంకా పెరిగే అవకాశముంది. ఒకవేళ ఇదే జరిగితే .. ఈ చిత్రం చరిత్ర సృష్టించనట్లే.

Agnathavasi Movie USA Record:

Agnathavasi Sensation at USA

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement