Advertisement

కీర్తి సురేష్ తన తల్లిపై పందెంలో నెగ్గింది!

Sun 07th Jan 2018 02:12 PM
keerthy suresh,win,mother,surya,gang movie  కీర్తి సురేష్ తన తల్లిపై పందెంలో నెగ్గింది!
Keerthy Suresh Sensational Comments on Her Mother కీర్తి సురేష్ తన తల్లిపై పందెంలో నెగ్గింది!
Advertisement

ప్రస్తుతం అందరి చూపు మలయాళ కుట్టి కీర్తిసురేష్‌ మీదనే ఉంది. ఆమె త్రివిక్రమ్‌శ్రీనివాస్‌-పవన్‌కళ్యాణ్‌ల కాంబినేషన్‌లోరూపొందుతున్న హ్యాట్రిక్‌ మూవీ, పవన్‌ 25వ ప్రతిష్టాత్మక చిత్రమైన 'అజ్ఞాతవాసి'లో మెయిన్‌ హీరోయిన్‌గా, త్రివిక్రమ్‌ పంచ్‌లు పేలుస్తూ ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌ పాత్రను చేయనుంది. ఈ చిత్రం ఈనెల 10న విడుదలకు సిద్దమవుతోంది. మరో వైపు నాలుగు రోజుల గ్యాప్‌లోనే ఆమె సూర్యతో కలిసి నటించిన తమిళ చిత్రం 'తానా సేంద్ర కూట్టం'లో హీరోయిన్‌గా నటిస్తోంది. అంటే బ్యాక్‌ టు బ్యాక్‌ చిత్రాలతో ఆమె తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. ఇక మార్చి చివరలో 'మహానటి' సావిత్రిగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఇప్పటికే తమిళ స్టార్‌ విజయ్‌తో 'భైరవ' చిత్రంలో నటించిన ఆమె తాజాగా మరోసారి విజయ్‌తో జోడీ కట్టనుంది. సన్‌ పిక్చర్స్‌ సంస్థ విజయ్‌-మురుగదాస్‌ల కాంబినేషన్‌లో రూపొందిస్తున్న హ్యాట్రిక్‌ చిత్రంలో కూడా ఈమె మరోసారి విజయ్‌ సరసన నటిస్తోంది.

ఇక స్టార్‌ సరసన నటించినా కూడా గ్లామర్‌షో చేయకపోవడం, నటిగా మాత్రమే తనను తాను నిరూపించుకుంటూ ఉండటం ఈమె ప్రత్యేకతగా చెప్పాలి. ఈమె 'అజ్ఞాతవాసి' చిత్రం కోసం తెలుగులో సొంతగా మొదటిసారి డబ్బింగ్‌ కూడా చెప్పుకుంది. ఇక మాటల మాంత్రికుడైన త్రివిక్రమ్‌ డైలాగ్స్‌ని అదే హాస్యధోరణిలో చెప్పడం ఎంతో కష్టం. కానీ ఈ పనిని ఈ భామ సక్సెస్‌ఫుల్‌గా చేసిందని సమాచారం. మరోవైపు సూర్య 'తానా సేంద్ర కూట్టం' చిత్రం తెలుగులో 'గ్యాంగ్‌' పేరుతో విడుదల కానుండగా, ఈచిత్రం కోసం సూర్య కూడా తెలుగులో ఓన్‌ డబ్బింగ్‌ చెప్పుకున్నాడు. మరి కీర్తిసురేష్‌ కూడా ఓన్‌ డబ్బింగ్‌ చెప్పిందా? లేదా? అనేది తెలియరావడం లేదు.

ఇక ఆమె తల్లి మేనక నాడు మలయాళ, తమిళంలో పెద్ద హీరోయిన్‌. ఆమె చిరంజీవి నటించిన 'పున్నమినాగు' చిత్రంలో కూడా నటించింది. నాడు హీరోగా ఉన్న సూర్య తండ్రి శివకుమార్‌తో మూడు చిత్రాలలో కలసి నటించింది. దాంతో చిన్ననాటి నుంచి కీర్తిసురేష్‌కి సూర్య అంటే ఇష్టం. దాంతోనే ఆమె తన చిన్ననాడు తన తల్లితో ఎప్పటికైనా సూర్యతో కలసి నటిస్తానని పందెం కట్టిందట. 'గ్యాంగ్‌' చిత్రంతో తాను ఈ పందెంలో గెలిచానని, ఇందులో సంప్రదాయమైన బ్రాహ్మణ యువతి పాత్రను చేస్తున్నానని తెలిపింది. ఇక ఈచిత్రంలో ఆమె పాత్రకు పేరు ఉండదని తెలుస్తోంది. పేరు లేని పాత్రతో పేరు తెచ్చుకోవాలని ఈ భామ చేస్తోన్న ప్రయత్నం ఎంత వరకు సఫలమవుతుందో వేచిచూడాల్సివుంది..!

Keerthy Suresh Sensational Comments on Her Mother:

Keerthy Suresh vs Keerthy Suresh Mother Menaka

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement