Advertisement

మధ్యలో వస్తే మడతడిపోద్ది: కత్తి!

Sat 06th Jan 2018 10:55 PM
kathi mahesh,reaction,kona venkat,poonam kaur  మధ్యలో వస్తే మడతడిపోద్ది: కత్తి!
Kathi Mahesh A Strong Cine Critic మధ్యలో వస్తే మడతడిపోద్ది: కత్తి!
Advertisement

నిజానికి నేడు నిజమైన జర్నలిస్ట్‌లు చాలా తక్కువ ఉన్నారనేది వాస్తవం. అందరూ ఎవరి ప్రాపకం కోసమో, వారి మోచేతి నీళ్ల కోసమే కక్కుర్తిపడే వారికి కొదువలేదు. దాంతోనే అన్నిరంగాలలో లాగానే జర్నలిజంలో కూడా విలువలు పతనమైపోతున్నాయి. నేడు దేశంలో కమ్యూనిజం, నక్సలిజం, ఫ్యాక్షనిజం, గూండాయిజం, రౌడీయిజం వంటి వాటికైనా విలువలు మిగిలి ఉన్నాయేమో గానీ జర్నలిజంలో విలువలు వేగంగా పతనమవుతున్నాయి. కానీ నిజమైన, నిజాయితీ కలిగిన జర్నలిస్ట్‌లు ఉంటే మాత్రం ఎంతటి వారితోనైనా ఢీ అంటే ఢీకొట్టగలరు. కానీ ముందుగా మనవైపు నిజాయితీ ఉండాలి. ఇక రెండు మూడు గంటల ప్రసంగాల కంటే ఓ వార్త ఎక్కువ శక్తివంతమైనది. తుపాకులు, కత్తుల కన్నా ఆ వార్త, ఓ హెడ్డింగ్‌ గెప్పవి. ఎన్నోహెడ్డింగ్‌లు, ఎన్నో వార్తల కన్నా ఓ కార్టూన్‌ మరింత ప్రభావితమైనది.

ఇక విషయానికి వస్తే కత్తి మహేష్‌ నీతినిజాయితీలు, ఆయన వైసీపీ మనిషి అనే విషయాలను పక్కనపెడితే ఆయన చేస్తున్న పోరాటంలో కాస్త మంచి ఉందనే చెప్పాలి. అభిమానం వెర్రితలలు వేస్తూ, సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులు ఆయా సినిమా స్టార్స్‌ని భజన ద్వారా మెప్పు పొందాలని భావించే వారందరికీ ఆయన ఒక్కడే సమాధానం ఇస్తున్నాడు. ఈ విషయం వాస్తవానికి పవన్‌ఫ్యాన్స్‌-కత్తిమహేష్‌కి మాత్రమే సంబంధించిన విషయం. కానీ పవన్‌ ఇందులో ఎలా తప్పు చేస్తున్నాడంటే ఆయన మౌనమే ఆయన చేస్తున్న తప్పు. తన అభిమానులకు దిశానిర్దేశం చేయకపోవడమే ఆయన చేస్తున్న ఘోరతప్పిదం.

ఇక ఈ విషయంలోకి తాజాగా కోనవెంకట్‌ ఎంటర్‌ అయ్యాడు. పవన్‌ మౌనాన్ని ఆసరాగా తీసుకుని ప్రతి జోకర్‌ రెచ్చిపోతున్నాడని అన్నాడు. దానికి కత్తి మహేష్‌, ఓ బ్రోకర్‌కి మరో బ్రోకర్‌, ఓ జోకర్‌కి మరో జోకర్‌ మద్దతు తెలపడం ఖాయమని తేల్చేశాడు. ఇప్పుడు ఈ వివాదంలోకి పూనమ్‌ కౌర్‌ వచ్చి చేరింది. పక్కవారిని విమర్శించడం ద్వారా డబ్బు సంపాదించాలనుకునే వారికంటే బిచ్చగాళ్లు మేలని, పాపం.. నిరుద్యోగం సమస్య.. సంపాదన లేక ఆయన పవన్‌పై విమర్శలు చేస్తున్నాడని చెబుతూ, ఆ ఫ్యాట్సోని రోజు టీవీలలో చూసి బోర్‌ కొడుతోంది. అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయనకు డబ్బులు డోనేట్‌ చేయండి...మనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారికి కూడా మనం ఆహారం ఇస్తున్నాం. ఇది చాలా గొప్పవిషయం. అతనికి మంచి పని దొరకాలని కోరుకుంటున్నాను.. అని వ్యాఖ్యానించింది.

దానిపై కత్తి మహేష్‌ స్పందిస్తూ, నన్ను ఫ్యాట్సో అన్నప్పుడే ఆమె సంస్కారం ఏమిటో అర్ధమైంది. పవన్‌ సాయంతో ఏపీకి చేనేత బ్రాండ్‌ అంబాసిడర్‌ పదవిని పొందింది. పవన్‌ మెప్పు కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోంది. పవన్‌ తనకి బతుకుదెరువు చూపించినందుకు ఆమె తన కృతజ్ఞత చూపుతోంది. ఆమె గతంలో పవన్‌ని నాలుగో పెళ్లి చేసుకోవడానికి రెడీ అని పలు యూట్యూబ్‌ ఛానెల్స్‌లో చెప్పింది. కావాలంటే చూడండి.. అంటూ ఆమెపై విరుచుకుపడ్డాడు.

Kathi Mahesh A Strong Cine Critic:

Kathi Mahesh Strong Reaction on Poonam and Kona Venkat  

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement