'సాహో' కి దిమ్మతిరిగే ఆఫర్..!

Fri 05th Jan 2018 08:27 PM
saaho,baahubali,prabhas,uv creations,t series,fancy offer  'సాహో' కి దిమ్మతిరిగే ఆఫర్..!
Saaho Prabhas Rejects A Fancy Offer 'సాహో' కి దిమ్మతిరిగే ఆఫర్..!
Sponsored links

బాహుబలితో దేశవ్యాప్తంగా విజబావుటా ఎగరేసిన ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమా తో బిజీ గా ఉన్న సంగతి అందరికి తెలిసిందే. బాహుబలి సీరీస్ తరువాత మళ్ళీ ప్రభాస్ నటిస్తున్న సినిమా అవ్వడంతో ఈ సాహో సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకి తగ్గట్టే నిర్మాతలు కూడా సాహో సినిమాని భారీ బడ్జెట్ తో సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాని కూడా దేశంలోని పలు భాషల్లో విడుదల చేసే ప్లాన్ తోనే ఈ సినిమాని భారీ లెవల్లో తెరకెక్కిస్తున్నారు. అందుకే ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్ అయిన శ్రద్ద కపూర్ తో సహా పలువురు బాలీవుడ్ స్టార్లను ఇందులో నటించడానికి ఒప్పించారు మేకర్స్. 

మరి అంతా బాలీవుడ్ నటులే కావడంతో... ఈ సినిమా బడ్జెట్ లో ఎక్కువ మొత్తం నటుల పారితోషికాలకే కోట్ల రూపాయలు అవుతుంది అని చెప్పినా ఆశ్చర్యపోనకర్లేదు. మరి ఈ సినిమాని తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక ప్రభాస్ కూడా ఈ మధ్యన ఒక ఇంగ్లీష్ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తానూ త్వరలోనే బాలీవుడ్ లో ఒక సినిమా చెయ్యబోతున్నాని ఫుల్ గా క్లారిటీ ఇచ్చి వదిలాడు. అయితే ఇప్పుడు ఈ సాహో సినిమాకి ఉన్న క్రేజ్ ని అలాగే ప్రభాస్ కి ఉన్నక్రేజ్ ను గమనించిన బడా నిర్మాణ సంస్థ టి సిరీస్ తెలుగు, మలయాళం, తమిళం, హిందీ హక్కులను సొంతం చేసుకునేందుకు దాదాపు  240 కోట్ల రూపాయల్ని యువి క్రియేషన్స్ కి ఆఫర్ చేసిందట. కానీ, యువి క్రియేషన్స్ ఏ విషయం తేల్చలేదని తెలుస్తుంది. 

Sponsored links

Saaho Prabhas Rejects A Fancy Offer:

UV Creations Rejected T Series Offer

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019