అంతా.. నాగార్జున ఈ సిక్స్‌ప్యాక్‌ గురించే..!

Thu 04th Jan 2018 01:51 PM
king nagarjuna,six pack,rgv,rgv 4,nagarjuna six pack  అంతా.. నాగార్జున ఈ సిక్స్‌ప్యాక్‌ గురించే..!
King Nagarjuna Six Pack Look Viral In Social Media అంతా.. నాగార్జున ఈ సిక్స్‌ప్యాక్‌ గురించే..!
Sponsored links

తనకు ఇతరుల్లా సిక్స్‌ప్యాక్‌ల కోసం ప్రత్యేకంగా శ్రమించాల్సిన అవసరం లేదని, సహజంగానే తన బాడీ సిక్స్‌ప్యాక్‌గా ఉంటుందని ఓసారి నాగ్‌ తెలిపాడు. ఆయన నటించిన 'ఢమరుకం' చిత్రంలో కూడా సిక్స్‌ప్యాక్‌తో దర్శనమిచ్చాడు. ఇక తనకు, నాగచైతన్యకి ఆరోగ్యం పట్ల ఎంతో ఎక్కువ శ్రద్ద అని, తన ఫుడ్‌ని తానే ప్రిపేర్‌ చేసుకుంటానని కూడా నాగ్‌ అన్నాడు. ఇక గతేడాది ఆయన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన సంవత్సరంగా చెప్పాలి. ఇద్దరు కొడుకులు నాగచైతన్య, అఖిల్‌లతో చెప్పి మరీ హిట్స్‌ కొట్టాడు. తాను తన కోడలితో 'రాజుగారి గది2' ద్వారా సక్సెస్‌ అయ్యాడు. మొత్తానికి విజయవంతంగానే తన చిన్నకుమారుడు అఖిల్‌ని 'హలో'తో రీలాంచ్‌ చేశాడు. నాగచైతన్య వివాహం, సమంత అక్కినేని కోడలు కావడం.. ఇలా అన్ని శుభసందర్భాలే. 

కాకపోతే కేవలం తన తండ్రి ఏయన్నార్‌కి జ్ఞాపకంగా ఉంచుకున్న 'మనం' సెట్‌ తగులబడి పోయింది. ఈ విషయంలో ఆయన తీపిజ్ఞాపకాలనైతే ఎవ్వరూ తిరిగి ఇవ్వలేరుగానీ ఆయన సెట్‌కి సంబంధించిన ఇన్సూరెన్స్‌ డబ్బు రావడంతో ఆర్ధికంగా ఆయనకేమీ నష్టం జరగలేదు. ఇక తాజాగా ఆయన తన సిక్స్‌ ప్యాక్‌ని చూపిస్తున్న ఫొటోని ఆయన టీం సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. 58 ఏళ్ల వయసులో కూడా ఈయన యంగ్‌ స్టార్స్‌కే కాదు.. తన కుమారులకు కూడా చెమటలు పట్టిస్తున్నాడు. ఈ ఫొటో విపరీతంగా వైరల్‌ అవుతోంది. 

ఇక నాగార్జున ప్రస్తుతం 'శివ, గోవిందా గోవిందా, అంతం' చిత్రాల తర్వాత మరోసారి రాంగోపాల్‌ వర్మ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో ఆయన పోలీస్‌ అధికారిగా కనిపించనుండటంలో ఆ పాత్ర కోసమే ఆయన ఈ బాడీ మెయిన్‌టెయిన్‌ చేస్తున్నాడని తెలుస్తోంది. నానితో చేసే సినిమాలో కూడా ఆయన ఇలాగే కనిపిస్తాడా? లేదా? అనేది ఆసక్తికరం. మొత్తానికి ఆయన తన కొడుకు వయసుండే నానికి అందులో అన్నగా నటించినా ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు. 

ఆల్‌రెడీ 'ఊపిరి'లో కార్తీ కంటే యంగ్‌గా కనిపించాడు. ఇక ఈ ఫొటో సిక్స్‌ప్యాక్‌ చూపిస్తూనే ఒంటిపై 2018 ఆర్జీవీ 4 అని రాసుకుని ఉన్నాడు. ఈ చిత్రానికి 'గన్‌, సిస్టమ్‌' అనే టైటిల్స్‌ని పరిశీలిస్తున్నారు. వర్మ ప్రియ శిష్యుడు పూరీ జగన్నాథ్‌ 'శివమణి' చిత్రంలో నాగ్‌ని ఎంతో గొప్పగా పోలీస్‌ అధికారిగా చూపించాడు. మరి గురువు వర్మ నాగ్‌ని పోలీసుగా ఎలా చూపిస్తాడో చూడాల్సివుంది. ఈ చిత్రం ఈ ఏప్రిల్‌లో విడుదలకు సిద్దమవుతోంది. 

Sponsored links

King Nagarjuna Six Pack Look Viral In Social Media:

King Nagarjuna's Six Pack Avatar Has People Swooning

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019