Advertisement

పవన్-త్రివిక్రమ్.. భలే ప్లాన్ చేశారు!

Wed 03rd Jan 2018 10:14 PM
pawan kalyan,trivikram srinivas,kodaka koteswara rao song,mass,plan  పవన్-త్రివిక్రమ్.. భలే ప్లాన్ చేశారు!
Trivikram and Pawan Sketch on Kodaka song Release పవన్-త్రివిక్రమ్.. భలే ప్లాన్ చేశారు!
Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ వున్నా కూడా ఆయన నుంచి వచ్చే సినిమాలకి ఎక్కువగా స్పందించేది మాస్ క్రౌడ్ అని అందరికి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' వంటి ఫామిలీ డ్రామా తరువాత మరొకసారి త్రివిక్రమ్ తో 'అజ్ఞాతవాసి' చిత్రం చేసినప్పటికీ అందులో కూడా మాస్ ని ఉర్రుతలూగించే అంశం ఏదో ఒకటే ఉంటుంది అని అభిమానులు ఆశ పడుతుండటం సహజమే. ఈ విషయం గ్రహించిన త్రివిక్రమ్ చిత్రంలో ఎలాంటి సర్ప్రైజ్ లు దాచారో తెలియదు కానీ ఆడియో విషయంలో మాస్ ని ఆకట్టుకునే ప్రయత్నంగా చేసిన ప్లానింగ్ లో మాత్రం బాగా సక్సెస్ అయ్యారు.

అనిరుధ్ సమకూర్చిన బాణీలు త్రివిక్రమ్ చెప్పబోతున్న కథకి తగిన విధంగా ఉండి ఉండొచ్చు, పైగా త్రివిక్రమ్ అభిరుచికి తగ్గ సాహిత్య విలువలు ఉండి ఉండొచ్చు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులలో మాస్ వర్గం హమ్ చేసుకునే విధంగా ఒక్క పాట కూడా తొలిగా విడుదల చేసిన ఆల్బమ్ లో లేకపోవటంతో అభిమానులు ఒకింత నిరాశకు గురైయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ పాడిన 'కొడకా..' పాటని నూతన సంవత్సర కానుకగా విడుదల చేయటం కోసం ఆపినందుకు ఆల్బమ్ లోని మిగిలిన పాటలు శ్రోతలలోకి వెళ్లే సమయం దొరికింది. ఇక స్వయంగా పవన్ కళ్యాణ్ గాత్రం అందించిన పాట కాబట్టి అభిమానులకి డబుల్ బోనస్ లానే కాకుండా సినిమాపై అంచనాలు మరింత పెంచేలా కళ్యాణ్-త్రివిక్రమ్ ల ప్లాన్ పని చేసింది.

Trivikram and Pawan Sketch on Kodaka song Release :

Agnathavasi Kodaka Koteswara Rao Song Released

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement