సునీల్ అజ్ఞాతవాసిని అందుకే మిస్సయ్యాడు!

Thu 28th Dec 2017 10:46 PM
sunil,clarity,agnathavasi,chance,miss,trivikram srinivas  సునీల్ అజ్ఞాతవాసిని అందుకే మిస్సయ్యాడు!
Sunil Reacted on Agnathavasi Movie Chance సునీల్ అజ్ఞాతవాసిని అందుకే మిస్సయ్యాడు!
Sponsored links

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో 25 వ మూవీగా తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా వుంది. పవన్ కళ్యాణ్ తో జల్సా, అత్తారింటికి దారేది వంటి హిట్ మూవీస్ ని తీసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ అజ్ఞాతవాసిని  డైరెక్ట్ చెయ్యడంతో ఈ సినిమా మీద అటు ఫ్యాన్స్ లోను.. ఇటు ప్రేక్షకుల లోను భారీ అంచనాలున్నాయి. వచ్చే నెల జనవరి 10 న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యే ఈ సినిమా పై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమాలో సీనియర్ హీరో వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటించడం, ఖుష్బూ వంటి సీనియర్ హీరోయిన్ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ కావడం వంటి విషయాలతో ఈ సినిమాకి మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే ఈ సినిమాలో సునీల్ కి ఒక క్యారెక్టర్ వచ్చి చేజారిందనే టాక్ నడుస్తుంది. త్రివిక్రమ్ కి మంచి  స్నేహితుడైన సునీల్ హీరోగా చక్రం తిప్పలేక మళ్ళీ కమెడియన్ గా మారుతానని ప్రకటించిన క్రమంలోనే ఈ అజ్ఞాతవాసి సినిమా తెరకెక్కడంతో... త్రివిక్రమ్, సునీల్ కోసం ఒక క్యారెక్టర్ ని అనుకున్నాడట.

అయితే లాస్ట్ మినిట్ లో స్క్రిప్ట్ లో ఆ క్యారెక్టర్ సరిగ్గా సెట్ అవ్వకపోవడం…. వల్ల సునీల్ క్యారెక్టర్ ని మూవీలో నుంచి తీసేశాడట త్రివిక్రమ్ శ్రీనివాస్. అజ్ఞాతవాసిలో వచ్చిన అవకాశం ఎలా చేజారిందో అనే విషయాన్ని స్వయంగా సునీల్  తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మరి ఈ సినిమాలో సునీల్ క్యారెక్టర్ ని తీసేసిన త్రివిక్రమ్ నెక్స్ట్ ఎన్టీఆర్ సినిమాలో అయినా సునీల్ కోసం క్యారెక్టర్ రాస్తాడో లేదో చూడాలి. ఇదిలా ఉంటే సునీల్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 2 కంట్రీస్ ఈ ఏడాది చివరిలో అనగా ఈ నెల 29 న రిలీజ్ అవుతుంది.

Sponsored links

Sunil Reacted on Agnathavasi Movie Chance:

Sunil Clarity About Agnathavasi Movie Chance Miss

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019