Advertisement

గాలి జనార్దనరెడ్డి.. మరో రామదాసంట!

Wed 27th Dec 2017 02:37 PM
gali janardhan reddy,donation list,interview  గాలి జనార్దనరెడ్డి.. మరో రామదాసంట!
Gali Janardhan Reddy Interview Details గాలి జనార్దనరెడ్డి.. మరో రామదాసంట!
Advertisement

అతనో సాధారణ పోలీస్‌ కానిస్టేబుల్‌ కుమారుడు. కానీ మైనింగ్‌ రారాజుగా ఉంటూ కర్ణాటక, ఆంధ్రా సరిహద్దులలోని బళ్లారిలో కాంగ్రెస్‌ కంచుకోటని బద్దలు కొట్టి బిజెపి జెండా పాతాడు. ఇక మైనింగ్‌ రారాజుగా ఆంధ్రా, కర్ణాటక సరిహాద్దులనే చెరిపివేసి మైనింగ్‌ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. కోట్లకు పడగలెత్తి ప్రతి రాఖీ పండుగకి కేంద్రంలోని తన సోదరి వంటి తనకు అన్నింటా అండగా నిలిచిన సుష్మాస్వరాజ్‌కి కోట్లు చేసే నగలు గిఫ్ట్‌గా ఇచ్చేవాడు. 

ఇక వెంకటేశ్వరస్వామికి 40కోట్లు పెట్టి బంగారు కిరీటం బహుమతిగా ఇచ్చాడు. బిజెపి పెద్దల అండదండలతో తనపై వచ్చిన కేసుల నుంచి క్రమంగా బయటపడుతున్నాడు. ఇక ఈయనకు స్వంత విమానాలు, మధ్యాహ్న భోజనం కూడా హెలికాప్టర్‌లో వస్తుందని అంటారు. అలాగే ఆయన మైనింగ్‌ చేసే ప్రాంతాల్లోకి ఎంత పెద్ద ఉన్నతాధికారులు, సిబిఐ, పోలీసులు ఎవ్వరూ ఆయన అనుమతి లేకుండా రాలేరు. ఆయన గురించి చెడుగా మాట్లాడితే ఆయన కింద పనిచేసే వారి చేతుల్లో ప్రాణాలు కోల్పోవాల్సిందేనని ప్రచారం కూడా ఉంది. అంతలా ఆయన తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. జగన్‌తో కలిసి పలు కేసుల్లో నిందితునిగా ఉన్నాడు. ఇంతకీ ఆయనెవరో అర్థమైందా? ఇంకెవరు..గాలి జనార్దనరెడ్డి. 

ఇక ఆయన తాజాగా మాట్లాడుతూ, తాను ట్యాంక్‌బండ్‌పై కర్ణాటక మంత్రులతో కలిసి చూసేందుకు వెళ్లినప్పుడు అక్కడి బ్రహ్మంగారి విగ్రహం వద్ద చిమ్మేవారి పేర్లు అడిగాను, వారంతా తమ పేర్లు సిద్దయ్య, పోలేరు, గోవిందు.. ఇలా అన్ని పేర్లు బ్రహ్మంగారి నోటి నుంచి వచ్చిన పేర్లే ఉన్నాయి. దాంతో వారందరికీ భారీగా డబ్బులను ఇచ్చి వారి పిల్లలను బాగా చదివించమని చెప్పాను. నేను కర్మ సిద్దాంతాన్ని నమ్ముతాను. శ్రీరామునికి గుడి కట్టించిన రామదాసు కూడా జైలుకి వెళ్లాడు. ప్రభుత్వ డబ్బుతో ఆయన గుడి కట్టించాడని జైలులో పెట్టారు. కానీ ఆ తర్వాత ఆయన కేవలం ప్రజల సొమ్ముతోనే ఆ గుడి కట్టించాడని తేలింది. ఇలా వెంకటేశ్వరస్వామికి 40కోట్లు పెట్టి నేను ఇచ్చిన కిరీటం కూడా నేను కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఇచ్చిందే. అదే విషయం భవిష్యత్తులో తేలుతుంది. 

ఇక నేను రాహుకాలం వంటివి చూసి బయటికి బయలుదేరుతాను. రాహుకాలం చూసి ఇలా నమ్మకాలు ఉన్నా దేవుడు నాకు అన్యాయం చేశాడని బాధపడను. గర్వంతో మనల్ని మనం మర్చిపోయినప్పుడే దేవుడు మనకి మరలా జ్ఞానం కలిగినందుకే కష్టాలను తెప్పిస్తాడు. దేవుడు నన్ను ఒళ్లు దగ్గర పెట్టుకోమని చెప్పిన వార్నింగ్‌గా దానిని భావిస్తాను. ఈ రాహుకేతువుల వంటివి, దేవుడిని నమ్మడం వల్లనే అతి సామాన్యమైన నేను ఈ స్థితికి రావడానికి కారణంగా భావిస్తాను. భగవంతుని కృప లేకపోతే నాలాంటి వాడు ఈ స్థాయికి ఎదిగేవాడా? 

ఇక నేను బంగారం పళ్లాలలో తింటానని, మా ఇంట్లో బంగారు కుర్చీలు ఉంటాయనేవి మొత్తం అబద్దం. మీడియాలో వచ్చినవన్నీ గ్రాఫిక్‌ మాయాజాలాలే. నేను ఇంట్లో ఎంతో నిరాడంబరంగా ఉంటాను. మరి బంగారు పళ్లాలు, కుర్చీలు నిజమైతే సిబిఐ వారు వాటిని కోర్టు ముందు పెడతారు కదా.. ! కోర్టుకి సమర్పించిన వస్తువుల జాబితా మీరు చూస్తే అవ్వన్నీ అబద్దమని మీకు అర్ధమవుతుంది. అవన్నీ కట్టుకథలంటూ తేల్చేశాడు.

Gali Janardhan Reddy Interview Details:

Gali Janardhan Reddy Donations List

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement