Advertisement

నా పెళ్లికి కూడా ఇక్కడినుంచే : మహేష్ హీరోయిన్!

Mon 25th Dec 2017 05:39 PM
kaira advani,sirisha reddy boutique,bharath ane nenu,mahesh babu,koratala shiva  నా పెళ్లికి కూడా ఇక్కడినుంచే : మహేష్ హీరోయిన్!
Kaira Advani Launches Designer Sirisha Reddy Boutique నా పెళ్లికి కూడా ఇక్కడినుంచే : మహేష్ హీరోయిన్!
Advertisement

ధోనీ సినిమాతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కైరా అద్వానీ. ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న ‘భరత్ అను నేను’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంతో తెరకెక్కుతోన్న ఈ మూవీతో కైరా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. అయితే తొలి సినిమా రిలీజ్ కాకుండానే కైరా క్రేజ్ పెరిగిపోయింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో కొత్తగా ప్రారంభంమైన యంగ్ డిజైనర్ శిరీషారెడ్డి బ్రైడల్ బొటిక్ ప్రారంభోత్సవం కైరా చేతుల మీదుగా జరిగింది. సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్స్ తో ప్రారంభమైన ఈ బొటిక్ లోని అన్నీ డిజైనర్ వేర్స్.. బ్రైడల్ డిజైన్స్ కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన శిరీషా డిజైన్స్ కు కైరా ఫిదా అయిపోయింది. అన్నీ ట్రెడిషనల్ గానూ ట్రెండీగా ఉన్నాయని శిరీష ప్రతిభను మెచ్చుకున్నారు. స్వయంగా శిరీష డిజైన్ చేసిన దుస్తులతోనే బొటిక్ ప్రారంభానికి విచ్చేసిన కైరా కెరీర్ కు సంబంధించిన విశేషాలను కూడా మీడియాతో షేర్ చేసుకుంది.. ఈ సందర్భంగా కైరా అద్వానీ చెప్పిన సంగతులు ఆమె మాటల్లోనే చూద్దాం..

'ఫస్ట్ టైమ్ తెలుగులో యాక్ట్ చేయబోతుండటం చాలా ఆనందంగా ఉంది. హైదరాబాద్ నాకు బాగా నచ్చింది. ఇక్కడి పీపుల్ నన్ను బాగా ఆదరిస్తున్నారు. మహేష్ బాబు లాంటి స్టార్ ను నేనింత వరకూ చూడలేదు. కొరటాల శివ దర్శకత్వంలో చేస్తోన్న భరత్ అను నేను అనే సినిమాతో చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ విషయంలో నేను బెస్ట్ స్టూడెంట్ గా మారిపోయాను. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే నా ఫ్రెండ్ శిరీష బొటిక్ ప్రారంభం నా చేతుల మీదుగా జరగడం చాలా ఆనందాన్నిచ్చింది. హైదరాబాద్ లో నేను చూసిన వారిలో శిరీష డిజైన్స్ అన్నీ చాలా బావున్నాయి. శిరీష ఫ్యాషన్ పై ప్యాషన్ ఉన్న డిజైనర్. అందుకే ఈ బ్రైడల్ కలెక్ట్స్ చూసి చాలా థ్రిల్ అయ్యాను. నా పెళ్లికి ఇక్కడి నుంచే డ్రెస్ తీసుకుంటాను. అలాగే నా కజిన్స్, నా ఫ్రెండ్స్ లో చాలామంది త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. వారందరికీ శిరీష బ్రైడల్ ఫ్యాషన్స్ నే ప్రిఫర్ చేస్తాను.. ' అంటూ శిరీష డిజైన్స్ పై ప్రశంసల వర్షం కురిపించింది కైరా అద్వానీ.

ఈ సందర్భంగా యంగ్ డిజైనర్ శిరీషా రెడ్డి మాట్లాడుతూ.. 'మారుతోన్న యువతరం టేస్ట్ కు అనుగుణంగా మోడ్రన్ టచ్ ఉన్న బ్రైడర్ వేర్ ను మేము అందిస్తున్నాం.. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి ఓ మధుర ఘట్టం. ఆ ఘట్టాన్ని మరింత మోడ్రన్ గా మెమరబుల్ గా మలచుకునేలా మా డిజైన్స్ ఉంటాయి. పెళ్లి మాత్రమే కాకుండా.. జీవితంలో జరిగే ప్రతి వేడుకకు సంబంధించీ మా దగ్గర అన్ని రకాల మోడ్రన్ డిజైన్స్ ఉంటాయి.. అలాగే వేడుకలకు సంబంధించి వారి పర్సనల్ టేస్ట్ మేరకు కూడా డ్రెస్ డిజైన్స్ చేస్తాము.. ఆధునిక యువతరం మెచ్చే అన్ని రకాల డిజైన్స్ ఉన్న ఈ బ్రైడల్ వేర్స్ ఆన్ లైన్ లో కూడా లభ్యమవుతాయి'.. అని చెప్పారు.

Kaira Advani Launches Designer Sirisha Reddy Boutique:

Kaira Advani about Bharath Ane Nenu Movie at  Launch of Designer Sirisha Reddy Boutique

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement