Advertisement
TDP Ads

ఈ అబ్బాయిని సాయి పల్లవి కాపాడేసింది!

Sun 24th Dec 2017 12:32 AM
sai pallavi,highlight,mca movie,nani,dil raju  ఈ అబ్బాయిని సాయి పల్లవి కాపాడేసింది!
Sai Pallavi Highlight in MCA Movie ఈ అబ్బాయిని సాయి పల్లవి కాపాడేసింది!
Advertisement

నాని హీరోగా వచ్చిన ఎంసీఏ సినిమా మిక్స్డ్ టాక్ తో థియేటర్స్ లో దూసుకుపోతుంది. సినిమా విడుదలైన మొదటి రోజు సినిమాకి మిక్స్డ్ టాక్ తోపాటు సెకండ్ హాఫ్ వలన సినిమా వీక్ అయ్యిందని కామెంట్స్ పడ్డాయి. మొదటి నుండి ఎంసీఏ సినిమా మీద భారీగా అంచనాలున్నాయి. వరుస విజయాలతో ఉన్న నాని, వరుస హిట్స్ కొడుతున్న దిల్ రాజు, ఫిదా బ్యూటీ సాయి పల్లవిల కలయికలో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. కానీ సినిమా విడుదలయ్యాక ఆ అంచనాలన్నీ తల్లకిందులయ్యాయి.

సినిమా టాక్ వీక్ అయినా సినిమా కలెక్షన్స్ మాత్రం అదిరిపోయాయి. అయితే ఇదంతా నేచురల్ స్టార్ నాని వలన గాని, సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు వల్ల కానీ కాదంట. కేవలం ఫిదా బ్యూటీ సాయి పిల్లవి వలనే సాధ్యమయ్యిందనే టాక్ వినబడుతుంది. ఫిదా సినిమాలో సాయి పల్లవి నేచురల్ నటనకు ఫిదా అయిన ప్రేక్షకులు ఎంసీఏ సినిమాకి క్యూ కట్టారని.. అలాగే ఈ సినిమాలో సాయి పల్లవి డాన్స్ లు ఎలా చేసిందనే క్యూరియాసిటీతోనే ప్రేక్షకులు థియేటర్ కి వచ్చారని... అందుకే ఈ కలెక్షన్స్ సాధ్యమయ్యాయనే టాక్ వినబడుతుంది. అందుకే ఎంసీఏ మొదటి రోజు వీక్ అన్నా కూడా కలెక్షన్స్ పరంగా దుమ్ము రేపింది... అలాగే రెండో రోజు హలో సినిమా వచ్చినా కూడా ఎంసీఏ కలెక్షన్స్ మీద ప్రభావం పడలేదంటున్నారు.

ఇక ఈ కలెక్షన్స్ కి నాని, దిల్ రాజు కన్నా సాయి పల్లవియే కారణమంటున్నారు. ఇక ఎంసీఏ లో సాయి పల్లవి పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేనప్పటికీ ఉన్నంతలో బాగానే నటించింది... డాన్స్ లు కూడా ఇరగదీసింది. ఈ మధ్య కాలంలో టాప్ హీరోయిన్లు ఎవ్వరూ వేయని పక్కా మాస్ స్టెప్స్ హుషారుగా వేసేసింది. అందుకే సినిమా టాక్, మిగిలిన వ్యవహారాలకు దూరంగా సినిమా కలెక్షన్లు వున్నాయి. పైగా రెండు నెలలుగా సరైన సినిమా పడలేదు. మరి ఇలా సాయి పల్లవి వల్లనే దిల్ రాజు ఈ రోజున ఒడ్డున పడుతున్నాడనే టాక్ మాత్రం సోషల్ మీడియాలో హోరెత్తిపోతుంది.

Sai Pallavi Highlight in MCA Movie:

Sai Pallavi is Reason to the MCA Decent Collections

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement